Rajasingh : మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

  • Written By:
  • Updated On - May 9, 2024 / 12:48 PM IST

MLA Rajasingh: వివాదాస్పద ఎమ్మెల్యేగా పేరున్న గోషామహల్‌ శాసనసభ్యులు రాజాసింగ్‌ పై మరో పోలీసులు కేసు(Police case) నమోదు చేశారు. గత రాత్రి నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌(Khanapur) పట్టణంలో రాజాసింగ్‌ బీజేపీ ఎంపీ అభ్య ర్థి నగేష్‌ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఆయన ప్రచారం నిర్వహించగా, ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాత్రివేళ సమయం దాటిపోయిన తన ప్రసంగాన్ని కొనసాగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే ప్రచార సభలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు రాజాసింగ్ పాయల్ శంకర్ ఎంపీ అభ్యర్థి జీ నగేష్ కార్యక్రమం నిర్వహించిన స్థానిక బీజేపీ నేత మహేందర్ లపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు ఖానాపూర్ పోలీసులు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌ ఫిర్యాదుమేరకు అదే పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 188, 290 రెడ్‌విత్‌ 34, సిటీ పోలీస్‌ యాక్ట్‌ 21/76 సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజాసింగ్‌ హనుమాన్‌ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితం శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా అఫ్జల్‌గంజ్‌ ఠాణాలో ఆయనపై కేసు నమోదైంది.

Read Also: Kashmir Encounter : 40 గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రాజాసింగ్‌పై.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ సస్పెన్షన్‌ వేటువేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొన్ని గంటల ముందు సస్పెన్షన్‌ ఎత్తివేసిన పార్టీ అధిష్ఠానం మళ్లీ ఆయననే గోషామహల్‌ అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన.. అసెంబ్లీలో బీజేఎల్పీ నేత పదవిని ఆశించారు. అయితే మహేశ్వర్‌ రెడ్డికి ఆ పదవిని అప్పజెప్పడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.