Financial Uncertainty : రాబోయే ఐదేళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్.. సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారంటే..

భవిష్యత్ ఆర్థిక సవాళ్ల కోసం వాళ్లు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నారు ?

Published By: HashtagU Telugu Desk
Financial Changes In July

Financial Changes In July

Financial Uncertainty : దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ? భవిష్యత్ ఆర్థిక సవాళ్ల కోసం వాళ్లు ఎంతమేర సంసిద్ధంగా ఉన్నారు ? అనేది తెలుసుకునేందుకు ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) కంపెనీ అనిశ్చిత్‌ ఇండెక్స్‌ 2024 పేరిట సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 7,978 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో ఆసక్తికర విషయాలను గుర్తించారు. ప్రత్యేకించి ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాదీలు ముఖ్యమైన సమాధానాలు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

సర్వేలో దేశ ప్రజలు ఏం చెప్పారు ?

  • రాబోయే ఐదేళ్లలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు(Financial Uncertainty) ఎదురయ్యే ముప్పు ఉందని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది దేశ ప్రజలు తెలిపారు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నారు.
  • వచ్చే ఐదేళ్లలో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోవచ్చనే భయంలో 35 శాతం మంది ఉన్నారు.
  • కొత్త  టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల జాబ్స్ పోవచ్చని 33.95 శాతం మంది భయపడుతున్నారు.
  • ఆర్థిక అనిశ్చిత  పరిస్థితులను ఎదుర్కొనేందుకు  ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నామని 76.57 శాతం మంది తెలిపారు.
  • అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సేవింగ్స్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెయింటైన్ చేస్తున్నామని 70 శాతం మంది  చెప్పారు.
  • అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు  49 శాతం మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లు చేసుకున్నారు.
  • తాము ఎలాంటి పైనాన్షియల్ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని 34.87 శాతం మంది సర్వేలో చెప్పడం గమనార్హం.
  • పిల్లల చదువుల కోసం ఫండ్స్ రెడీగా ఉంచుకోవాలని 42.24 శాతం మంది మహిళలు, 38.13 శాతం మంది  పురుషులు చెప్పారు.
  • 40 శాతం మంది రిస్క్ ఎక్కువున్నా రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ వచ్చే విభాగాలలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
  • 72 శాతం మంది గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌లలో పెట్టుబడి పెడతామన్నారు.
  • షార్ట్ టెర్మ్ లాభాల కంటే లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొగ్గుచూపుతామని సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది తెలిపారు.

Also Read :Maoists Encounter : భద్రాద్రి అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారు ?

  • వచ్చే ఐదేళ్ల ఆర్థిక అనిశ్చితి ఎదురైనా భవిష్యత్తుకు భరోసా కల్పించేలా సిద్ధంగా ఉన్నామని 95 శాతం మంది హైదరాబాదీలు చెప్పారు.
  • భవిష్యత్తు ఆర్థిక సవాళ్ల నుంచి ఫ్యామిలీని కాపాడేందుకు బీమా పాలసీలు తీసుకున్నామని 83 శాతం మంది నగరవాసులు తెలిపారు.
  • తాము మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెడుతున్నామని 10 శాతం మంది పేర్కొన్నారు.
  • హైదరాబాద్ వాసుల్లో 48 శాతం మంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
  • హెల్త్ లేదా యాక్సిడెంటర్ ఎమర్జెన్సీ ఎదురైతే వాడుకునేందుకు హైదరాబాద్ వాసుల్లో దాదాపు 69 శాతం మంది సేవింగ్స్ అకౌంటులో డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు.

Also Read :Nandigam Suresh :హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

  Last Updated: 05 Sep 2024, 10:14 AM IST