Maoists : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 86 మంది మావోయిస్టులు కొత్తగూడెం మల్టీ జోన్-1 పోలీసు బెటాలియన్ కార్యాలయంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వారిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.
Read Also: CM Chandrababu : జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం చంద్రబాబు
జిల్లా వ్యాప్తంగా గత నాలుగు నెలల్లో 66 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 203 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25 వేల రూపాయల చెక్కును ఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం అని వారు సూచించారు. ఇది వారిలో కొత్త జీవితానికి మొదటి అడుగు కావాలని, సమాజంలో విలీనమై సజీవ జీవితం గడపాలని పిలుపునిచ్చారు. మావోయిస్టులు లొంగిపోవడం ద్వారా భద్రతా పరిస్థితుల మెరుగుదలకు ఇది పెద్ద బూస్ట్‌గా నిలిచిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లు పక్కా బూటకపు ఎన్‌కౌంటర్లు అంటూ ఓ లేఖను విడుదల చేసింది. అందులో కార్పొరేట్ దోపిడీని సులభతరం చేసేందుకు కేంద్రం దేశంలో మావోయిస్టుల నరమేధానికి తెరలేపారని ఆక్షేపించారు. ఆదివాసీలు, విప్లవకారులు ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలని తాము చర్చలకు సిద్ధం అంటూ లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లోంగిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: PM Modi : శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని మోడీ మధ్య ధ్వైపాక్షిక చర్చలు