Site icon HashtagU Telugu

Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్

Ragging

Ragging

Ragging: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ మహమ్మారి ఎక్కువవుతుంది. కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్స్ ని మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకుండా హాస్టల్స్ ఖాళీ చేస్తున్న పరిస్థితి. తాజాగా కేయూలో 81 మంది విద్యార్థులు సస్పెండ్ కు గురయ్యారు.

వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. వీరిలో వాణిజ్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, జంతు శాస్త్ర విభాగాల విద్యార్థులు ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేయూ మహిళా హాస్టళ్లలో కొద్ది రోజులుగా పరిచయ కార్యక్రమం పేరుతో సీనియర్లు జూనియర్లను వేధిస్తున్నారు.

అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడుతున్నారు. ఇది భరించలేని కొందరు జూనియర్లు ఈ నెల 18న వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ప్రొఫెసర్లు రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు నివేదిక ఇచ్చారు. దీంతో వర్సిటీ అధికారులు ఆయా విభాగాలకు చెందిన 81 మంది విద్యార్థినులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Also Read: Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల వివరాలివే

Exit mobile version