Site icon HashtagU Telugu

New RTC Buses Inaugurate : కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం..

80 New Rtc Buses Inaugurate

80 New Rtc Buses Inaugurate

తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తుంది. అధికారంలోకి వచ్చి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిలో సంతోషం నింపడమే కాదు ఆర్టీసీ ని లాభాల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. రూ. 400 కోట్లతో 1,050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త బస్సులు (80 New RTC Buses Inaugurate by Minister Ponnam) ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా మంత్రి (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ..ఆర్టీసీలో 1050 కొత్త బస్సులు ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఈరోజు 80 బస్సులు ప్రారంభించామని.. త్వరలో 1000 ఎలెక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని.. వారి కృషి వల్లే సంస్థ ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని.. మహిళల నుంచి ఎంత మంచి స్పందన ఉందో అర్థం అవుతుందన్నారు. 40-50 ఉండే ఆక్యుపెన్సీ ఇప్పుడు 100 దాటి పోతోందన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలను బాధ్యతగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు పనిచేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి మరువలేనిదని.. ఉద్యమకారుడిగా, ఎంపీగా తనకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కార్మికులు కష్టపడ్డారని.. ఆర్టీసీది మర్చిపోలేని కృషి ఉందన్నారు. ఆర్టీసీ సంక్షేమ, పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Read Also : TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక