Site icon HashtagU Telugu

Hyderabad : బైక్‌పై 8 మందితో స్టంట్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన యువకులు

8 Youths Were Caught Doing

8 Youths Were Caught Doing

సోషల్ మీడియా రీల్స్‌ (Social Media Reels)కు యువతలో పెరిగిన మోజు ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. ఫేమస్ కావాలన్నా ఉద్దేశంతో, వైరల్ కావాలన్న లక్ష్యంతో వారు పిచ్చి పిచ్చి పనులు చేసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనలో ఒకే బైక్‌పై ఎనిమిది మంది యువకులు ప్రమాదకరంగా స్టంట్స్ (Bike Stunts) చేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు.

Operation Sindhu: కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ సింధు.. భార‌త్‌కు ఎంత‌మంది వ‌చ్చారంటే?

ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్ వద్ద జరిగింది. స్టంట్స్ చేస్తున్న సమయంలో వీరిలో కొంతమంది లేడి జాకెట్లు ధరించి బైక్‌పై నిలబడి విన్యాసాలు చేశారు. ఈ వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ బైక్‌ను గుర్తించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిలో కొంతమంది మైనర్లు అని కూడా తేలింది.

Flights Cancelled : భారత్‌లో 48 విమాన సర్వీసులను రద్దు..ఎందుకంటే !!

ఇలా రోడ్లపై ప్రజలకు ప్రమాదకరంగా మారే పనులు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్ కోసం బాధ్యత లేకుండా ప్రవర్తించడం తగదని, ఇటువంటి చర్యలు మళ్లీ జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. యువత రోడ్లపై ఇటువంటి చర్యలు తీసుకుంటే తమకే కాకుండా ఇతరులకూ ప్రమాదం పొంచి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. రీల్స్ పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.