TS : మంత్రివర్గంలో కొత్తగా మరో ఆరుగురు..రేవంత్ డిసైడ్

  • Written By:
  • Updated On - February 20, 2024 / 12:13 PM IST

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధికారంలోకి రావడమే ఆలస్యం మంత్రివర్గ విస్తరణ చేపట్టి 11 మందికి కీలక పదవులు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావొస్తుంది. దీంతో మిగతా శాఖలకు సంబదించిన మంత్రులను ఖరారు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక సభ ఎన్నికల లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ చూస్తున్నారు. ఇందుకు గాను అధిష్ఠానంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. జిల్లాలకు, అదే విధంగా బలహీన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా రేవంత్ యోచిస్తున్నట్లు సమాచారం. విస్తరణ అనంతరం మంత్రివర్గంలో కొత్తగా మరో ఆరుగురు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 11 మంది ఉన్న సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్‌ తదితరులు ఏఐసీసీ కీలక నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంగళవారం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు సమావేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సాయంపై వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read Also : D50: ధ‌నుష్ 50వ సినిమా టైటిల్ ఫిక్స్‌.. ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా?