511 PG Seats: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్ల పెంపు

కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద తెలంగాణ (Telangana)కు తొమ్మిది మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్ల (511 PG Seats) పెంపునకు కేంద్రం సహకారం అందించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేశారు.

  • Written By:
  • Publish Date - March 15, 2023 / 10:31 AM IST

కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద తెలంగాణ (Telangana)కు తొమ్మిది మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్ల (511 PG Seats) పెంపునకు కేంద్రం సహకారం అందించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేశారు. మంగళవారం బిజెపి సభ్యుడు కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు పవార్ సమాధానమిస్తూ.. సూపర్ స్పెషాలిటీ బ్లాకుల ఏర్పాటు ద్వారా మూడు మెడికల్ కాలేజీల అప్‌గ్రేడేషన్ కోసం ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) కింద తెలంగాణకు మద్దతు అందించామని చెప్పారు.

తెలంగాణలో మొత్తం 7,415 యూజీ, 2,723 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయని, వీటిలో 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3015 యూజీ సీట్లు, 27 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4400 సీట్లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎండీ, ఎంఎస్‌, డిప్లొమా సీట్లు 1208, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 1340 సీట్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో డీఎం, ఎంసీహెచ్ సీట్లు 153, ప్రైవేట్ కాలేజీల్లో 22 సీట్లు ఉన్నాయని తెలిపారు.

Also Read: 56 Blades In The Stomach: రాజస్థాన్‌లో వింత ఘటన.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు..!

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు 2014కి ముందు 387 ఉండగా, ప్రస్తుతం 660కి అంటే 71 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. ఇంకా, MBBS సీట్లు 2014కి ముందు 51,348 నుండి 101,043కి 97 శాతం పెరిగాయని, వీటిలో 52,778 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, 48,265 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అందుబాటులో ఉన్నాయన్నారు. 2014కి ముందు 31,185 పీజీ సీట్లు ఉండగా ప్రస్తుతం 65,335కి 110 శాతం పెరిగాయని, ఇందులో 13,246 డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB), ఫెలోషిప్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (FNB) పీజీ సీట్లు, కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్‌లో 1621 పీజీ సీట్లు ఉన్నాయన్నారు.