Site icon HashtagU Telugu

Secunderabad Railway Station : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మరో 5 టికెట్ కౌంటర్లు…

Secunderabad Railway Statio

Secunderabad Railway Statio

విద్యాసంస్థలన్నిటికి సెలవులు (Summer Holidays) రావడం తో అంత పల్లె బాట పడుతున్నారు. పిల్లల చదువుల కోసం ఎక్కువగా తమ సొంతర్లను వదిలి చాలామంది హైదరాబాద్ (Hyderabad) లో ఉంటున్నారు. సంక్రాంతి , దసరా టైంలలో మాత్రమే సొంతర్లకు ఎక్కువగా వెళ్తుంటారు. ఆ తర్వాత వేసవి సెలవుల్లోనే..ఇక ఇప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అంత తమ సొంతర్లకు పయనం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ (Secunderabad Railway Station) ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా టికెట్ (Ticket) తీసుకునేందుకు దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది. దీంతో చాలామంది టికెట్ తీసుకోకుండానే ట్రైన్ ఎక్కిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతిరోజూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుండి ప్రయాణించేవారి సంఖ్య 1.80 లక్షలుంటే.. వేసవి సెలవులు కావడంతో 2.20 లక్షల వరకూ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం స్టేషన్ లో క్యూఆర్‌ కోడ్‌తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ..చాలామంది తెలియక టికెట్ కౌంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో సౌత్ సెంట్రల్ రైల్వేఅధికారుల స్టేషన్‌లో అదనంగా మరో 5 టిక్కెట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీగా బారులు తీరాల్సిన పని లేకుండా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు … ప్రయాణికులకు అనుగుణంగా ప్రత్యేక ట్రైన్లను కూడా పెంచుతామని తెలిపారు.

Read Also : Hyd Metro : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు