Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 4,798 మంది అభ్యర్థులు మొత్తం 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో అత్యధికంగా 154 మంది నామినేషన్లు వేశారు. కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలోనూ 104 నామినేషన్లు దాఖలయ్యాయి. మేడ్చల్‌లో 127 నామినేషన్లు, ఎల్బీ నగర్‌లో 87, సిద్ధిపేటలో 76, హుజూరాబాద్‌లో 62 నామినేషన్లు వచ్చాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న 2 నియోజకవర్గాల్లో ఒకటైన కొడంగల్‌లో 26 నామినేషన్లే వచ్చాయి. అయితే ఈ నామినేషన్లపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. అభ్యర్థులు వేసిన నామినేషన్లలో కొన్ని తిరస్కరణ పొందే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్ పత్రాలను సరిగా నింపకపోతే, వాటిని తిరస్కరిస్తారు. అంతేకాదు.. నామినేషన్లు వేస్తూ, అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లలో అంశాలు వంద శాతం కరెక్ట్ అవ్వాలి. లేదంటే.. భవిష్యత్తులో కోర్టు కేసులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతుంది. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఈ నెల 15 లోగా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే, డిపాజిట్ మనీ వెనక్కి ఇచ్చేస్తారు. అలా తీసుకోకపోతే, డిపాజిట్ మనీ.. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే తీసుకునే వీలు ఉంటుంది. 15 తర్వాత మిగిలే నామినేషన్లు ఎన్ని ఉంటే, అంత మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు(Telangana Polls) లెక్క.