జగిత్యాల (Jagtial) జిల్లాలో ఓ బస్సును లారీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు అయ్యాయి. ఎండపల్లి మండలం కొత్తపేట సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. ఇందులో ఆరుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న లారీని మినీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. 25 మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Pet Dog: యజమాని బొటనవేలు కొరికేసిన కుక్క.. కానీ అదే అతనికి వరమైందట?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన ఓ కుటుంబ సభ్యులు బంధువు అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు ధర్మపురి వైపు వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గజ్వేల్ నుంచి మినీ బస్సులో బయలుదేరారు. రోడ్డుపై పడిన చెట్టును ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో స్టీరింగ్‌పై డ్రైవర్ అదుపు తప్పడంతో ఎదురుగా వస్తున్న లారీ, బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిలో 11 మందిని చికిత్స నిమిత్తం కరీంనగర్ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.