Covid Cases : ఏపీ, తెలంగాణలో మళ్లీ కరోనా దడ.. కేసులు ఇలా..

Covid Cases : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం దడ పుట్టిస్తోంది.

  • Written By:
  • Updated On - December 24, 2023 / 07:28 AM IST

Covid Cases : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం దడ పుట్టిస్తోంది. శనివారం రోజు తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్‌లోనూ 12 కొత్త కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 24 మందికి కరోనా నిర్ధారణ కావడంతో మరోసారి ఆందోళనలు పెరిగాయి.  తెలంగాణలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 38కి పెరిగింది. వీటిలో ఎక్కువ కేసులు హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయి. శనివారం రోజు కొత్తగా  బయటపడిన కరోనా కేసుల్లో 9 హైదరాబాద్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. మిగతా 3 కేసులు వరంగల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కన్ఫార్మ్ అయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 1322 మందికి కరోనా పరీక్షలు చేయగా 38 మందికి పాజిటివ్ వచ్చింది.  మరో 30 మంది టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంది. తెలంగాణలో జేఎన్-1 కరోనా వేరియంట్ వల్ల ఎవరూ చనిపోలేదని రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఇక  ఏపీీలో శనివారం రోజు కొత్తగా బయటపడిన 12 కరోనా కేసులలో ఎన్టీఆర్ జిల్లాలో 5, విశాఖపట్నంలో 3, కాకినాడలో 2, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి ఉన్నాయి. సీఎం జగన్ అత్యవసర సమీక్ష తర్వాత జారీ చేసిన ఆదేశాలతో ఆస్పత్రుల్లో కరోనా ప్రోటోకాల్ పాటించడం మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

శనివారం మనదేశంలో 423 కరోనా కేసులు(Covid Cases) కన్ఫార్మ్ అయ్యాయి. వాటిలో అత్యధికంగా 266 కేసులు కేరళలో నిర్ధారణ అయ్యాయి. మరో 70 కేసులు కేరళ పొరుగున ఉన్న కర్ణాటకలో బయటపడ్డాయి. కరోనాతో కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. అంతకుముందు శుక్రవారం రోజు దేశంలో 328 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలోనూ 265 కేసులు కేరళకు చెందినవే. దీన్నిబట్టి కేరళలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కేరళకు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆపడం ద్వారా అక్కడ వైరస్ వ్యాప్తికి కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు.

Also Read: MS Dhoni: ఆర్మీలోకి మళ్ళీ ధోనీ .. ఎప్ప్పుడంటే?