Site icon HashtagU Telugu

Telangana Floods : తెలంగాణలో వరదల బీభత్సానికి 17 మంది మృతి

Sikkim Flash Flood

Telangana Floods

Telangana Floods : భారీ వర్షాలు, వరదలు తెలంగాణలోని  ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాత్రి నాటికి  మొత్తం 17 మంది మృతి చెందారు. ములుగు జిల్లాలో 8 మంది వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు. మల్యాలలో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను అజ్జు, షరీఫ్, మైబూబ్ ఖాన్, సమ్మక్క, మాజీద్‌, కరీమ్, రశీద్, బీబీ అని అధికారులు గుర్తించారు. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం మునిగిపోయింది. 8 మంది వరద నీటిలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. సహాయక బృందాలును మృతదేహాలను గుర్తించాయి.

Also read : Rain Alert Today : ఇవాళ తేలికపాటి వానలే.. ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువ!

హన్మకొండలో ముగ్గురు, ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ఒకరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరదలకు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. గురవారం (జూన్ 28) నాడు గ్రామం వరదలో(Telangana Floods) చిక్కుకోగా.. ప్రజలందర్నీ ప్రభుత్వం క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శుక్రవారం కొందరు  పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి చేరుకున్నారు.

Also read : Australian Military Helicopter: సముద్రంలో కూలిపోయిన ఆస్ట్రేలియా మిలిటరీ హెలికాప్టర్.. నలుగురు పైలట్లు మిస్సింగ్