Union Bank Of India : గవర్నమెంటు బ్యాంకులో జాబ్ కావాలా ? అయితే ఇదే మంచి అవకాశం. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో 200 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో, 200 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు నవంబర్ 13 వరకు అప్లై చేయొచ్చు. రెగ్యులర్ బేసిస్‌లో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. ఏపీ, తెలంగాణ పరిధిలో ఈ పోస్టులకు అప్లై చేసే వారికి కచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. 20 నుంచి 30 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. కొన్ని వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు రూ.175.
ఇతర రాష్ట్రాల్లో పోస్టులు ఇలా..
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనుండగా.. కర్ణాటకలో 300 పోస్టులు, తమిళనాడు, గుజరాత్‌లలో చెరో 200 పోస్టులు ఉన్నాయి.
- ఒడిశా, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో చెరో 100 పోస్టులు ఉన్నాయి.
- మహారాష్ట్ర, అసోంలలో చెరో 50 పోస్టులు ఉన్నాయి.
పరీక్ష విధానం
- ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తొలుత ఆన్‌లైన్ పరీక్షను(Union Bank Of India) నిర్వహిస్తారు.
- ఆన్‌లైన్ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. వీటికి 200 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు ఆన్సర్‌కు 0.25 మార్క్‌ను కట్ చేస్తారు.
- ఈ పరీక్షలో ఎంపికయ్యే అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ పెడతారు.
- చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. మొత్తం మీద ఈ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మంచి అవకాశం.