Hyderabad: హైదరాబాద్ శివార్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిది మంది వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి అందులో ముగ్గురు 15 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం చేశారు. తల్లిదండ్రులు లేకపోవడంతో బాధితురాలు, ఆమె సోదరుడు మీర్‌పేట్‌లోని వారి బంధువుల ఇంట్లో ఉంటున్నారు. సోమవారం ఉందయం ఎనిమిది మంది వ్యక్తులు కత్తులతో బలవంతంగా వాళ్ళు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించారు. వారిలో ముగ్గురు బాధితురాలిని బలవంతంగా టెర్రస్‌పైకి తీసుకెళ్లగా, మరికొందరు ఆమె సోదరుడిని, ఇతరలను కత్తితో బెదిరించారు. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నిరసనకు దిగింది.
మీర్‌పేట మేయర్ పారిజాతరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాధితురాలి ఇంటి దగ్గర బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పారిజాతరెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలను అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సంఘటనా స్థలానికి వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎల్‌బీ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయిశ్రీ తెలిపారు. మైనర్‌పై సామూహిక అత్యాచారం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము అని ఆయన చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సఖి కేంద్రానికి తరలించి వాంగ్మూలం నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
బాధితురాలు దిల్‌సుఖ్‌నగర్‌లోని గార్మెంట్ షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుండగా ఆమె సోదరుడు ఫ్లెక్స్ బోర్డు దుకాణంలో పని చేసేవాడినని చెప్పాడు.
Also Read: CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు, విజన్ 2020 ఫలం