Site icon HashtagU Telugu

Big Shock To Maoist : 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

14 Maoists From Chhattisgar

14 Maoists From Chhattisgar

తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా(Kothagudem District)లో మావోయిస్టులకు (Maoist ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివిధ హోదాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్న 14 మంది, ఇందులో ముగ్గురు మహిళలు సహా, ఈ రోజు కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj)ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన మావోయిస్టు శిబిరాల్లో కలకలం రేపింది. లొంగిపోయినవారంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు.

ఈ మావోయిస్టుల లొంగుబాటు వెనుక ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కీలకపాత్ర వహించాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మార్పునకు దారి తీస్తున్నాయి. ఈ మార్పులే మావోయిస్టులను తన మార్గాన్ని మార్చుకునేలా ప్రభావితం చేస్తున్నాయని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.

Iron Rod Vs Infant: 30 రోజుల పసికందుకు ఇనుప చువ్వలతో 40 వాతలు.. ఏమైంది ?

ఇటీవల కాలంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టు ఆగడాలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడ మావోయిస్టు శిబిరాల అనుమానం కలిగినా కాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించి భద్రతా పరిస్థితిని పటిష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు మామూలు జీవితం వైపు అడుగులు వేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మావోయిస్టులపై పోలీస్ దళాలు భారీ స్థాయిలో దాడులు చేపడుతున్నాయి. అలాగే లొంగుబాటుకు ప్రోత్సహిస్తూ పునరావాస పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రజా జీవన విధానంలో కలిసిపోయేందుకు ముందుకొచ్చిన ఈ 14 మంది మావోయిస్టులకు ప్రభుత్వం సహకారం అందించనుంది.