Site icon HashtagU Telugu

Hyderabad: 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం

Hyderabad

Hyderabad

Hyderabad: నేరేడ్‌మెట్‌లో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం జరిగింది. అయితే ఇదంతా చేసింది బాలిక ప్రియుడే కావడం విశేషం. సదరు బాలికపై ఆమె ప్రియుడుతో పాటు మరో నలుగురు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు నేరేడ్‌మెట్‌లోనే ఉంటున్న ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడితో కలిసి రోజు బైక్‌పై బయటకు వెళ్లేది. కొన్నాళ్ల తర్వాత ఆమెతో శారీరక బంధం పెంచుకున్నాడు. అలా పలుమార్లు ఆ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చుకున్నాడు. అయితే ఆమెను తన ఇతర స్నేహితులకు కూడా పరిచయం చేశాడు ఆ కీచకుడు. వారందరూ గంజాయి మత్తులో ఉండగా ఆమెపై అత్యాచారం చేశారు. ఇలా కొన్నాళ్ల తర్వాత బాలిక అనారోగ్యం పాలైంది. విషయం తల్లికి చెప్పింది. అనంతరం కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాచిగూడ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ సుభాష్ కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి ఐదుగురిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Also Read: మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడు

Exit mobile version