తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress ) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఐఏఎస్ ల బదిలీలు (IAS Officers Transfer) నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది అధికారులను బదిలీ చేసిన సర్కార్..తాజాగా మరో 13 మందిని బదిలీ చేస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు చేసింది.
బదిలీ అయినా అధికారులు వీరే..
రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణ రెడ్డి, నల్లగొండ కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా హనుమంతరావు, పురపాలక శాఖ సంచాలకులుగా టీకే శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మందా మకరందు, పర్యాటక శాఖ సంచాలకులుగా జెడ్ కే హనుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హనుమంతకు అదనపు బాధ్యతలు, ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్‌గా ఎస్ హరీశ్, విపత్తు నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి హరీశ్‌కు అదనపు బాధ్యతలు, ఆర్ అండ్ ఆర్, భూసేకరణ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్ చక్రవర్తికి అదనపు బాధ్యతలు, డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కే చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియమితులయ్యారు.
అటు రెవెన్యూ శాఖ (Revenue Department) ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు మంత్రి పొంగులేటి. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు (Deputy Collectors) మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా బదిలీలలో అదనపు కలెక్టర్లు (Additional Collectors), ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు, మరియు సివిల్ సప్లయిస్ వంటి విభాగాలలో పని చేస్తున్న వారిని బదిలీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా కొన్ని ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనేక మంది బదిలీ అయ్యారు. అయితే, డిప్యూటీ కలెక్టర్లు ఎల్ రమేష్, ఎన్ ఆనంద్ కుమార్, మరియు వి. హనుమా నాయక్ కు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా, వారిని రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలనుకుంటున్నారు.
ఈ బదిలీలు హైడ్రా విస్తరణ, కొత్త ఆర్వోఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత, మరియు పెండింగ్ భూ సమస్యల పరిష్కారం వంటి అనేక అంశాల నేపథ్యములో జరిగినట్లు తెలుస్తుంది. భూ పరిపాలనలో అనేక సంస్కరణలు రానున్నందున, మంత్రి పొంగులేటి వీటన్నింటిని సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన ప్లాట్ ఫారమ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చర్యలు రెవెన్యూ శాఖలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సహాయపడుతాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also : #SSRMB : రాజమౌళి – మహేష్ మూవీ రెండు పార్ట్స్..?