Hyderabad: మూసీ నది ఒడ్డున నివసించే ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. హైదరాబాద్ లోని మూసీ నది పరిసర ప్రాంతమో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.

Hyderabad: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. హైదరాబాద్ లోని మూసీ నది పరిసర ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూసీ నదీ ఒడ్డున నివసించే ప్రజల కొరకు 10 వేల బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే మూసీ నదీ సమీపంలో అక్రమంగా చేపట్టిన కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మూసీ అడ్డంకులు తొలగిన తర్వత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటకే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రాథమిక ప్లానింగ్ పూర్తయినట్టు అధికారులు మంత్రి కేటీఆర్ కు వెల్లడించారు.

మంత్రి కేటీఆర్ మున్సిపల్ పరిథిలోని ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించారు. ఈ క్రమంలో మూసీ ఒడ్డున నివసించే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా 10,000 ఇళ్లను నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 70,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్దిదారులకు పంపిణి చేయనున్నట్టు ప్రకటించారు. ఒకరోజు వ్యవధిలోనే కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Telangana: తెలంగాణలో దొర గారి భూదందాలు: షర్మిల