హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (Hyderabad Outer Ring Road) సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు (100 Feet NTR Statue) స్థలం మంజూరు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీడీపీ నేత టీడీ జనార్దన్ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగువారందరికీ ప్రీతికరమైన నేత. అలాంటి నటుడి పేరిట Knowledge సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్ పర్యాటక కేంద్రంగా కూడా మారుతుందని జనార్దన్ తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా నిర్మించబడుతుందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇది నూతన తరాలకు ఎన్టీఆర్ గొప్పతనం, ఆయన సేవలు తెలిపే విధంగా అభివృద్ధి చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిస్తుందని, ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉంటె హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని తాను అన్నట్లు బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ‘సెక్రటేరియట్ పక్కన అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నాను, కానీ ఎన్టీఆర్ ఘాట్‌ను తీసివేయాలని’ తాను అనలేదని , కావాలనే బిఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.’ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణం. ఆయనంటే నాకు వ్యక్తిగతంగా ఎంతో అభిమానం ఉంది’ అని రాజగోపాల్ పేర్కొన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : KTR Case : అక్రమ కేసులతో మా గొంతు నొక్కలేరు : ఎమ్మెల్సీ కవిత