Site icon HashtagU Telugu

Sandhya Theatre Incident : ‘పుష్ప 2’ కలెక్షన్లలో 10% శ్రీతేజ్ ఫ్యామిలీకి ఇవ్వాలి – తీన్మార్ మల్లన్న

Mallanna Alluarjun

Mallanna Alluarjun

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Incident)లో గాయపడిన శ్రీతేజ్ (Sritej ) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) అన్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించిన ఆయన వైద్యుల మాటల ప్రకారం అతడు ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వెల్లడించారు. ఈ ఘటనపై టాలీవుడ్ (Tollywood) నుంచి స్పందన అందకపోవడంపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పుష్ప 2’ ప్రమోషన్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ (Allu Arjun) సందర్శించిన సమయంలో థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మల్లన్న డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు వెళ్లుతున్నారు గానీ, అసలు గాయపడిన శ్రీతేజ్‌ను ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పుష్ప 2’కు భారీ కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో అందులో 10% అయినా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని సూచించారు. ఈ ఘటన ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మల్లన్న కోరారు. అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలపై పునర్విచారణ జరపాలని మల్లన్న తెలిపారు. బెనిఫిట్ షోల కారణంగా థియేటర్ల వద్ద భద్రతా లోపాలు బయటపడుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ పునరాలోచన అవసరమని అభిప్రాయపడ్డారు.

Read Also : Telangana Govt Good News : సంక్రాంతి సంబరాలకు తెలంగాణ సర్కార్ సిద్ధం..