T Congress : కుత్బుల్లాపూర్‌లో త‌న గెలుపు ఖాయ‌మంటున్న కాంగ్రెస్ అభ్య‌ర్థి

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని

  • Written By:
  • Updated On - October 18, 2023 / 08:30 AM IST

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతుంది. ఇప్ప‌టికే 55 మంది అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాన‌ని ధీమా వ్యక్తం చేశారు. హ‌న్మంత్ రెడ్డి రాజకీయ జీవితం 1994 లో ప్రారంభమైంది.. ఆయ‌న విద్యార్థి నాయ‌కుడిగా పార్టీలో ఉంటూ అంచ‌లంచెలుగా ఎదిగారు. 1994 నుండి 1996 వరకు ఆయన కుత్బుల్లాపూర్‌మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షునిగా, కుత్బుల్లాపూర్ వాసులతో మమేకమై ప్ర‌జ‌ల సమస్యలకు పరిష్కారం చూపడంలో కీలక పాత్ర పోషించారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయాల్లో చేరడానికి ముందు.. 1992 నుండి న్యాయవాదిగా 1994 వరకు ప్రాక్టీస్ చేసారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వ‌చ్చారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో ప్రభుత్వ పాఠశాలలు బాగా నిర్వహించబడ్డాయని… ప్రతినెలా తనిఖీలు నిర్వహించామ‌న్నారు. కానీ బీఆర్ఎస్ వ‌చ్చిన ఈ పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని దాదాపు అన్ని పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో వివిధ ప్రాథమిక సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలలు, అవసరమైన సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రితో సహా అనేక చోట్ల అభివృద్ది జ‌ర‌గ‌లేద‌ని తాము ప‌రిశీలించామ‌న్నారు. నియోజకవర్గం మొత్తం నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గ‌లో ఎక్క‌డ చూసిన గుంత‌ల రోడ్డేన‌ని.. ఒక్క రోడ్డు కూడా ప్ర‌భుత్వం వేయించ‌లేద‌న్నారు. తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలు అండగా ఉంటాన‌ని తెలిపారు.

Also Read:  Rahul – Priyanka – Telangana : ఇవాళ రామప్పకు రాహుల్, ప్రియాంక.. పర్యటన వివరాలివీ