తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 28,057 పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను ఎన్నికల అధికారులు స్వీకరించారు. సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి (వికలాంగులు), ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం 12డిలో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటిలో 28,057 దరఖాస్తులు మాత్రమే ఈసీ ఆమోదించింది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 812 దరఖాస్తులు రాగా, వాటిలో 757 ఆమోదించబడ్డాయి. బహదూర్‌పురా నియోజకవర్గంలో తక్కువగా 11 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో మొత్తాన్ని ఈసీ అధికారులు ఆమోదించారు. ఫారం 12డి పంపిణీ నవంబర్ 1న ప్రారంభం కాగా, దరఖాస్తులను సమర్పించేందుకు నవంబర్ 8 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఎలక్ట్రిసిటీ వింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌లకు అర్హులైన అత్యవసర సేవా విభాగంలో పని చేసే వారు, ఆహారం, పౌర సరఫరా, BSNL, EC ద్వారా అధికారం పొందిన మీడియా వ్యక్తులు, అగ్నిమాపక సేవల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌లకు అర్హులుగా ఉన్నారు.
Also Read: APSRTC : అరుణాచలంకు ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ