Your Vote : ఓటరు జాబితాలో మీ ఓటు ఉందా ? ఇలా చెక్ చేసుకోండి..

Your Vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.  రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది.

Published By: HashtagU Telugu Desk
Voter Option

Voter Option

Your Vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.  రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఓటు మీ వజ్రాయుథం. ఎవరైనా కొత్తగా ఓటు నమోదు కోసం voters.eci.gov.in అనే ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో ఫారం-6 ద్వారా అప్లై చేసుకోవచ్చు. విదేశాల్లోని భారతీయులు ఓటు నమోదు కోసం ఫారం-6ఏ ద్వారా  దరఖాస్తు చేయాలి. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి ఫారం 6బీని నింపాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు కార్డులో పేరు, చిరునామా, వివిధ మార్పుల కోసం ఫారం-8 ద్వారా అప్లై చేయాలి.

We’re now on WhatsApp. Click to Join

ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా  అనేది ఎలా చూసుకోవాలి ? ఓటు కార్డులోని మన వివరాలను ఎలా సవరించుకోవాలి ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.. దీని కోసం తొలుత voters.eci.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావాలి. ముందుగా సెల్ ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం పోర్టల్ లోకి లాగిన్ అయి మన అప్ డేటెడ్ ఇంటి అడ్రస్ ను  నమోదు చేస్తే మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే ఒక ప్రత్యేక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటరు గుర్తింపు కార్డు నంబరును నమోదు చేస్తే జాబితాలో పేరు, పోలింగ్ కేంద్రం తదితర సమగ్ర సమాచారం మీ ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఈవిధంగా బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో) దగ్గరికి వెళ్లకుండానే మన ఓటుకు సంబంధించిన వివరాలను పొందొచ్చు. ఒకవేళ ఓటరు జాబితాలో మన పేరు లేకుంటే.. మళ్లీ కొత్తగా అప్లై చేసుకుంటే ఓటుహక్కు వస్తుంది.ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పద్దెనిమిదేళ్లు నిండే వారంతా కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు.

Also read : Durga Temple EO : దుర్గ‌గుడిలో ఈవో సీటుపై లొల్లి.. కొత్త ఈవోకి బాధ్య‌త‌లు ఇవ్వని పాత ఈవో

  Last Updated: 13 Oct 2023, 11:25 AM IST