తెలంగాణలో నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లకు తాయిళాలు అందిస్తున్నారు. అలా ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు సిద్దమైయ్యాయి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస రెడ్డి ఫోటోతో ఉన్న ప్రెషర్ కుక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. దీంతో కంది శ్రీనివాసరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందున పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తన సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని దాదాపు 45,000 మంది ఓటరు కుటుంబాలకు ఒక ప్రెషర్ కుక్కర్‌ను బహుమతిగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే నగరంలో పలుచోట్ల డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్న సంఘటనలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘునాథ్ యాదవ్ ఫోటోతో ఉన్న కుక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుక్కర్లు పంచేందుకు వాటిని సిద్దం చేశారు. మొత్తం 87 ప్రెషర్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుక్కర్‌లను నిల్వ చేసిన రాములు నాయక్, నరసింహను అరెస్టు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రూ.12 లక్షల నగదు పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి రూ.7 లక్షల నగదును సంగారెడ్డి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకోగా, మరో వ్యక్తి నుంచి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ పోలీసులు బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు . ముంబై-హైదరాబాద్ హైవే, నాందేడ్-అకోలా-సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో తెలంగాణ పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏదైనా పని కోసం డబ్బుతో ప్రయాణిస్తే సరైన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని పోలీసులు పౌరులను హెచ్చరిస్తున్నారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి, హైదరాబాద్‌లో చైతన్యపురి పోలీసులు రూ. 30 లక్షల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విడతగా రూ. 30 లక్షలు, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రూ. 15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో హబీబ్ నగర్ పోలీసులు రూ.5 లక్షల 12 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, వనస్థలిపురం పోలీసులు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ మేనిఫెస్టో తో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం: మంత్రి హరీశ్ రావు