Xiaomi: షావోమీ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత ఏడాది షావోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి మనందరికీ

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 07:00 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత ఏడాది షావోమి 12 ప్రో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా షావోమీ 12 ప్రో అప్‌గ్రేడ్ వర్షన్ షావోమీ 13 ప్రో ఇండియాలో విడుదల అయిన సందర్భంగా పాత మోడల్‌ పై కంపెనీ ఏకంగా రూ.10,000 ధర తగ్గించింది. కాగా షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తున్న విషయం తెలిసిందే. అందులో 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999 కాగా, 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 గా ఉంది. ఈ రెండు వేరియంట్లపై ఏకంగా రూ.10,000 తగ్గింపు ధరను ప్రకటించింది కంపెనీ.

ధర తగ్గించడంతో షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ 256జీబీ వేరియంట్ రూ.52,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.56,999 ధర లకు లభిస్తున్నాయి. కొత్త ధరలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. విటితో పాటుగా మరిన్ని ఆఫర్స్ కూడా ప్రకటించింది షావోమీ సంస్థ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.3,000 తగ్గింపు పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3,000 పొందవచ్చు. అలాగే షావోమీ ఫ్యాన్స్‌కు ప్రత్యేకమైన ఆఫర్స్ ఉన్నాయి. షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి షావోమీ 12 ప్రో కొంటే అదనంగా రూ.5,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర్స్‌తో షావోమీ 12 ప్రో మొబైల్ 8జీబీ 256జీబీ వేరియంట్‌ను రూ.49,999 కు, 12జీబీ 256జీబీ వేరియంట్‌ను రూ.53,999 ధరలకు లభించనున్నాయి.

ఇకపోతే షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల WQHD+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ సపోర్ట్ లభిస్తుంది. అలాగే షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్ 50 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ను కలిగి ఉండనుంది .