Xiaomi 13 Series: మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే ?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి గురించి మనందరికీ తెలిసిందే. మార్కెట్లో షియోమి స్మార్ట్

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 06:35 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి గురించి మనందరికీ తెలిసిందే. మార్కెట్లో షియోమి స్మార్ట్ ఫోన్ లకు విపరీతమైన డిమాండ్ ఉంది. షియోమి సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే మార్కెట్లోకి మరొక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది షియోమి సంస్థ. షియోమి 12కి కొనసాగింపుగా షియోమి 13 సిరీస్‌ ను లంచ్ చేయనుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు అనగా డిసెంబర్​ 1న లాంఛ్ చేయనున్నట్లు షియోమి కంపెనీ తాజాగా తన అధికారిక వెబ్‌ పేజీ ద్వారా వెల్లడించింది.

అయితే ఈ సిరీస్​ మొదట చైనాలో విడుదల అయ్యింది. అయితే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ భారత్ తో పాటు ఇతర దేశాల్లోకి పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా షియోమి 13 లాంచిగ్‌ను Weibo పోస్ట్ ధృవీకరించింది. ఈ ఈవెంట్​ లోనే లైకా బ్రాండింగ్, లాంచ్ డేట్‌ తో పాటుగా షియోమి 13 మోనికర్​ వంటి కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ సిరీస్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన కొత్త MIUI 14 వెర్షన్‌ను అందించనుంది. ఈ సిరీస్‌లో షియోమి 13, షియోమి 13 ప్రో ఫోన్లు కూడా మార్కెట్​ లోకి రానున్నాయి.

షియోమి 13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు చైనాలోని బీజింగ్‌లో రిలీజ్‌ కానున్నాయి. అయితే తాజాగా షియోమి కంపెనీ షియోమీ 14 టీజర్‌ను లాంచ్​ చేసింది. అయితే త్వరలో రాబోయే షియోమి 13 సిరీస్​ కొత్త స్నాప్‌ డ్రాగన్‌ 8 Gen 2 చిప్‌సెట్‌ పై పని చేస్తుందని తెలిపారు. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్ తో లభించనుంది. కాగా షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్​లో రూ.62,999 ధర వద్ద లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇండియన్‌ మార్కెట్‌లో షియోమి 13 ప్రో ధర షియోమి 12 కంటె అధికంగా అంచనా వేస్తున్నారు.