Site icon HashtagU Telugu

X New Feature : ‘ఎక్స్‌’లో కొత్తగా ‘ఆర్టికల్స్’ ఫీచర్.. ఎలా వాడాలో తెలుసా ?

X New Feature

X New Feature

X New Feature : ట్విట్టర్‌ (ఎక్స్)లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దానిపేరే ‘ఆర్టికల్స్’. ఎక్కువ పదాలతో రాసిన పెద్ద కంటెంట్‌‌ను పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ప్రీమియం+ చెల్లింపు వినియోగదారులు, ధృవీకరించబడిన సంస్థలకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. సాధారణ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందో లేదో అనే దానిపై ట్విట్టర్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Maruti Jimny : ఆ కారుపై రూ.లక్షన్నర డిస్కౌంట్.. కొనేయండి

ఎక్స్​ యూజర్లకు ఆడియో, వీడియో కాలింగ్​ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా సబ్​స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు సైతం ఉచితంగా ఎక్స్​ యాప్​ నుంచి ఆడియో, వీడియో కాల్స్​ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ను గతేడాది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఐఓఎస్) ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్​ ప్రీమియం యూజర్లను ఈ ఫీచర్ వాడుకోవడానికి అనుమతిచ్చారు.

ఎలాన్‌ మస్క్‌ రాకతో.. భారీ మార్పులు

2022లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌, సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్విట్టర్​కు ‘ఎక్స్​’గా నామకరణం చేశారు. ఎక్స్​ను సమగ్ర అప్లికేషన్​గా చేయాలన్న ఆలోచనతో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బ్లూటిక్ సబ్​స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆడియా, వీడియో కాల్స్​ను సాధారణ యూజర్లు ఉపయోగించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎక్స్​ యూజర్లు సబ్​స్క్రిప్షన్​తో సంబంధం లేకుండా, యాప్​లోని ఏ యూజర్​ నుంచి అయినా కాల్స్​ రిసీవ్​ చేసుకోవచ్చు.