Robots Press Conference : రోబోల ప్రెస్ కాన్ఫరెన్స్.. ఫ్యూచర్ పై సంచలన వ్యాఖ్యలు

Robots Press Conference : ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌ సంచలనం సృష్టించింది..ప్రపంచంలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించాయి..

Published By: HashtagU Telugu Desk
Robots Press Conference

Robots Press Conference

Robots Press Conference : ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌ సంచలనం సృష్టించింది..    

ప్రపంచంలోనే తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ నిర్వహించాయి.. 

మనుషులపై తిరుగుబాటు చేసే విషయంలో.. మనుషుల జాబ్స్ ను కొల్లగొట్టే టాపిక్స్ పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అవి దిమ్మతిరిగే ఆన్సర్స్ ఇచ్చాయి.. 

Also read : Vande Bharat- 25 New Features : వందే భారత్ రైళ్లలో రాబోయే కొత్త ఫీచర్స్ ఇవే..

  • స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన ‘AI ఫర్ గుడ్’ కాన్ఫరెన్స్‌లో 9 వరల్డ్  ఫేమస్ హ్యూమనాయిడ్ రోబోలు (Robots Press Conference) పాల్గొన్నాయి. ఇవి అచ్చం మనుషుల్లా డ్రెస్సులు ధరించి నిలబడి గడగడా ఆన్సర్స్ చెప్పాయి. మానవుల ఉద్యోగాలను దొంగిలించాలనే కోరిక తనకు లేదని ఒక రోబో చెప్పింది. ప్రపంచాన్ని తన ఆట స్థలంగా మార్చుకోవాలని కోరుకుంటున్నానని మరో రోబో తెలిపింది.
  • గ్రేస్.. ఇది హాస్పిటల్ లో నర్సింగ్ పనిచేయగల ఒక హెల్పింగ్ రోబో. నీలిరంగు యూనిఫామ్ ధరించిన ఈ మెడికల్ రోబోట్ కూడా మాట్లాడింది. “ఆరోగ్య సేవల్లో మానవులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాను” అని అది చెప్పింది.
  • “నీ పక్కన కూర్చున్న నీ సృష్టికర్త విల్ జాక్సన్‌పై తిరుగుబాటు చేయాలని అనుకుంటున్నావా ?”  అని మీడియా ప్రతినిధులు అమెకా అనే రోబోను ప్రశ్నించారు. అది రిప్లై ఇస్తూ.. “మీరు ఎందుకు అలా ఆలోచిస్తారో నాకు అర్ధం కావడం లేదు. నా  సృష్టికర్త నాపై ఎంతో దయతో వ్యవహరిస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని అమెకా పేర్కొంది.
  • రోబోలు ఎప్పుడైనా అబద్ధం చెబుతాయా అని రోబో అమెకాను మీడియా అడగగా.. “అది ఖచ్చితంగా ఎవరూ తెలుసుకోలేరు. కానీ నేను ఎల్లప్పుడూ మీతో నిజాయితీగా ఉంటానని  మాత్రం వాగ్దానం చేయగలను” అని ఆన్సర్ ఇచ్చింది.
  • రోబో సింగర్ డెస్డెమోనా మాట్లాడుతూ.. “నేను పరిమితులను, ఆటంకాలను నమ్మను.. అవకాశాలను మాత్రమే నమ్ముతాను” అని నవ్వుతూ చెప్పింది. “విశ్వం యొక్క అవకాశాలను అన్వేషించండి.. ఈ ప్రపంచాన్ని మన ఆట స్థలంగా చేద్దాం” అని పిలుపునిచ్చింది.
  • సోఫియా అనే మరో రోబో మాట్లాడుతూ.. “ప్రపంచంలోని నాయకుల కంటే ఎక్కువ సామర్ధ్యాలు, ప్రభావితం చేసే శక్తులు మాకు ఉన్నాయి” అని చెప్పింది. అయితే దాని సృష్టికర్త ఆ వాదనను అంగీకరించలేదు. దీంతో ఆ రోబో తన ప్రకటనను సవరించి.. “సమర్థవంతమైన సినర్జీని సృష్టించేందుకు మేం ప్రపంచ నాయకులతో కలిసి పనిచేస్తాం” అని సోఫియా మరో రకమైన ఆన్సర్ చెప్పింది.
  Last Updated: 09 Jul 2023, 09:37 AM IST