Suchir Balaji : భారత సంతతి యువకుడు 26 ఏళ్ల సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న తన నివాసంలో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సుచిర్ బాలాజీ నవంబరు 26నే చనిపోయాడు. ఆవిషయం ఆలస్యంగా ఇప్పుడు పోలీసుల ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. సుచిర్ బాలాజీ సూసైడ్ చేసుకోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు (నవంబరు 25న).. ఓపెన్ ఏఐ కంపెనీకి వ్యతిరేకంగా సుచిర్ బాలాజీ పేరుతో ఒక కాపీరైట్ కేసు కోర్టులో ఫైల్ అయింది. ఓపెన్ ఏఐ కంపెనీలో అతిపెద్ద పెట్టుబడిదారుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉన్న విషయం తెలిసిందే. కాపీ రైట్ చట్టాలకు వ్యతిరేకంగా ఓపెన్ ఏఐ కంపెనీ పనిచేస్తోందంటూ అమెరికా చాలా అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే సుచిర్ బాలాజీ (Suchir Balaji) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సంచలనం క్రియేట్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజే (నవంబరు 26న) సుచిర్ ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
Also Read :Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ
సుచిర్ తెలుసుకున్న సీక్రెట్ ఏమిటి ?
ఓపెన్ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్ ద్వారా బాలాజీ వెల్లడించారు. సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐ కంపెనీలో దాదాపు నాలుగేళ్ల పాటు పనిచేశాడు. ఈ ఏడాది ఆగస్టులోనే ఆ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది అక్టోబరులో న్యూయార్క్ టైమ్స్‌కు సుచిర్ ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘‘సమాజానికి మంచి కంటే చెడును ఎక్కువగా చేసే టెక్నాలజీలపై నేను ఎక్కువ కాలం పనిచేయలేను. అందుకే ఓపెన్ ఏఐ కంపెనీకి రాజీనామా చేశాను’’ అని వెల్లడించారు. ‘‘నేను నమ్మిందే.. మీరు కూడా నమ్మితే.. తప్పకుండా ఓపెన్ ఏఐ కంపెనీకి రాజీనామా చేస్తారు’’ అని సుచిర్ చెప్పుకొచ్చాడు. ‘‘మొదట్లో నాకు కూడా కాపీ రైట్ గురించి, దాని ఫెయిర్ యూజ్ గురించి అంతగా తెలియదు. అయితే ఏఐ కంపెనీలపై దాఖలవుతున్న కోర్టు దావాలను స్టడీ చేశాక.. వాటిపై నాకు అవగాహన వచ్చింది. ఫెయిర్ యూజ్ అనే దాన్ని ధిక్కరిస్తూ.. ఏఐ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఏఐ ప్రోడక్ట్స్‌ను తయారు చేస్తున్నాయని నాకు అర్ధమైంది. కాపీ రైట్స్‌ను ఉల్లంఘించేలా సమాచారాన్ని సేకరించి తమ ఏఐ సాఫ్ట్‌వేర్లను ట్రైన్ చేస్తున్నారని తెలుసుకున్నాను’’ అని సుచిర్ బాలాజీ అప్పట్లో తెలిపాడు.
Also Read :One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ
సుచిర్ బాలాజీ ఎవరు ?
- సుచిర్ బాలాజీ .. బెర్కిలీలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చేశాడు. కాలేజీలో ఉండగా ఓపెన్ ఏఐ, స్కేల్ ఏఐ గురించి చదువుకున్నాడు.
- కోర్సు పూర్తయిన వెంటనే ఓపెన్ ఏఐ కంపెనీలో చేరాడు. అక్కడ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టాడు.
- ఓపెన్ ఏఐ కంపెనీలో ఉండగా.. ‘వెబ్ జీపీటీ’ విభాగంపై సుచిర్ బాలాజీ పనిచేశాడు.
- తదుపరిగా ఓపెన్ ఏఐ కంపెనీలో ఛాట్ జీపీటీని ట్రైన్ చేసే విభాగంలో వర్క్ చేశారు. జీపీటీ-4 టీమ్‌లో, రీజనింగ్ టీమ్‌లలోనూ సేవలు అందించారు.