Site icon HashtagU Telugu

Whatsapp New Features : వాట్సాప్‌లో మూడు సరికొత్త ఫీచర్స్.. ఇవిగో

Whatsapp New Features

Whatsapp New Features

Whatsapp New Features : వాట్సాప్ తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలోనే మరో మూడు ఫీచర్లను తీసుకొచ్చే దిశగా వాట్సాప్ కసరత్తును ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే ఓ సూపర్ ఫీచర్‌ను యూజర్స్ కోసం రెడీ చేసింది. అది అందుబాటులోకి వస్తే వాట్సాప్ గ్రూప్ వీడియోకాల్లో ఒకేసారి 32 మందికి  మనం స్క్రీన్‌ను షేర్ చేయొచ్చు.  వీడియో కాలింగ్‌లో పాల్గొంటున్న వాళ్లు కంప్యూటర్ వాడినా.. మొబైల్ ఫోన్ వాడినా ఈ గ్రూప్ వీడియో కాల్‌లో కనెక్ట్ కావచ్చు. వర్చువల్ మీటింగ్స్, ఆన్ లైన్ తరగతులకు ఈ ఫీచర్(Whatsapp New Features) ఒక గుడ్ న్యూస్ లాంటిది.

We’re now on WhatsApp. Click to Join

‘స్పీకర్ స్పాట్ లైట్’

వాట్సాప్ తెచ్చిన మరో ఫీచర్ ‘స్పీకర్ స్పాట్ లైట్’.  దీని ద్వారా వాట్సాప్ గ్రూప్ కాల్స్,  ఛాట్స్‌ను మేనేజ్ చేయొచ్చు.ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. మనం వాట్సాప్ గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు మాట్లాడే వ్యక్తి స్క్రీన్ ‌పై హైలైట్ అవుతాడు.

Also Read :H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు

క్యూఆర్ కోడ్‌తో ఛాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్

వాట్సాప్ ఛాట్ హిస్టరీని ఇంతకుముందు పాత ఫోను నుంచి కొత్త ఫోనుకు ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టతరంగా ఉండేది.  ఇకపై దాన్ని ఈజీగా మార్చే ఓ ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. దీంతో ఇప్పటివరకు ఈ పని కోసం కేబుల్‌లు, థర్డ్ పార్టీ సొల్యూషన్‌లు వాడుతున్న యూజర్లకు ఊరట లభించనుంది. వాట్సాప్ ఛాట్ హిస్టరీని సింపుల్‌గా పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు పంపడానికి ఒక క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ అందించనుంది. ఈ ఫీచర్‌ను వాడుకునే ముందు మనం వాట్సాప్‌ను పాత ఫోన్, కొత్త ఫోన్ రెండింటిలోనూ అప్ డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత  పాత ఫోనులోని వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మెనూ ఆప్షన్‌ను తెరవాలి. అందులోని ఛాట్ సెక్షన్‌ను క్లిక్ చేసి.. ఛాట్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. క్యూఆర్ కోడ్‌తో ఛాట్ ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని యాక్టివేట్ లేదా ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత మన ఎదుట “ట్రాన్స్‌ఫర్ యువర్ ఛాట్స్” అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది. దానిపై క్లిక్ చేశాక .. మన ఛాట్ హిస్టరీని సేకరించుకొని ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అనంతరం కొత్త ఫోనులోని వాట్సాప్ సెట్టింగ్‌లలో ఉండే ఛాట్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో  “QR కోడ్‌ని స్కాన్ చేయి” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మన పాత ఫోనులో జనరేట్ అయిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడానికి.. కొత్త ఫోనులో ఉన్న కెమెరాను ఉపయోగించాలి. కొత్త ఫోను కెమెరాతో QR కోడ్‌‌ను స్కాన్ చేసిన తర్వాత, Wi-Fi డైరెక్ట్ టెక్నాలజీ మీ చాట్ హిస్టరీని పాత ఫోన్ నుంచి కొత్త దానికి బదిలీ చేస్తుంది.

Also Read : Donate Old Clothes: మీరు మీ పాత బట్టలను దానం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..!