WhatsApp Update : వాట్సాప్ వెబ్‌ను వినియోగించే వారికి ఒక గుడ్ న్యూస్. వారి కోసం ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల యూజర్లు ఎంతో సౌకర్యవంతంగా ఫీలవుతారు. అదేమిటి అంటే.. కాలింగ్ ఫీచర్. వాట్సాప్ వెబ్‌లో ఇకపై వాయిస్ కాల్, వీడియో కాల్ ఫీచర్లు వస్తున్నాయి. నేరుగా వాట్సాప్ వెబ్ నుంచే మనం ఈ కాల్స్ చేసుకోవచ్చు. తద్వారా స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడటాన్ని తగ్గించొచ్చు. వాట్సాప్ వెబ్(WhatsApp Update)ను వాడే వాళ్లలో చాలామంది ప్రొఫెషనల్సే ఉంటారు. అలాంటి వారికి టైం చాలా విలువైనది. ఈ కొత్త ఫీచర్ మూలంగా వాళ్లందరికీ ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. వాట్సాప్ మొబైల్ యాప్, డెస్క్‌టాప్ వర్షన్లకు చాలా కాలం నుంచే కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఈ వర్షన్లలో కాలింగ్ సదుపాయాన్ని వాడుకునేందుకు వాట్సాప్ యాప్‌ను తప్పనిసరిగా యూజర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై వాట్సాప్ వెబ్‌లో ఆ అవసరం ఉండదు. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్ చేయొచ్చు. అంటే త్వరలోనే వాట్సాప్ వెబ్ ఛాట్స్‌లోనూ ఫోన్, వీడియో కాల్ ఐకాన్‌లు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
Also Read :Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య
‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్
ఇటీవలే ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. వాట్సాప్ ఛాట్ పేరు మీద క్లిక్ చేసి ‘అడ్వాన్స్‌డ్ ఛాట్ ప్రైవసీ’ ఆప్షన్‌ను మనం ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాతి నుంచి మన వాట్సాప్ ఛాట్‌ను కానీ.. మనం వాట్సాప్‌లో పంపిన ఫొటోలు, వీడియోలను కానీ అవతలి వ్యక్తులు సేవ్ చేయలేరు. డౌన్ లోడ్ చేయలేరు. ఎక్స్‌పోర్ట్ చేయలేరు. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కూడా కాదు. అంటే మనం పంపించే ఛాట్‌ను వేరే గ్రూప్‌నకు షేర్ చేయడం మినహా, వాట్సప్‌ను దాటి వేరే సోషల్ మీడియాలలో షేర్ చేయడం కుదరదు. ఒకవేళ ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేద్దామని ట్రై చేసినా ‘కెనాట్ ఎక్స్‌పోర్ట్ ఛాట్’ అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.