Site icon HashtagU Telugu

Search By Date : ​‘సెర్చ్​ బై డేట్’.. వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఫైల్స్ వెతకడం ఈజీ

Search By Date

Search By Date

Search By Date :వాట్సాప్‌లోనూ డేట్‌ను బట్టి ఛాట్‌ను ఫిల్టర్ చేసుకునే ఫీచర్ వచ్చేసింది. దానిపేరే ‘సెర్చ్​ బై డేట్’!! ఇప్పటికే కొంతమంది యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చేసింది. త్వరలోనే అందరికీ ఇది అందుబాటులోకి రానుంది.  ఈ ఫీచర్ ద్వారా మీకు కావాల్సిన తేదీలోకి ఈజీగా వెళ్లి.. ఆ తేదీనాటి మెసేజ్‌లు, మీడియా ఫైల్స్​ను చూసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్​లతోపాటు ఐఓఎస్​, మ్యాక్​, వాట్సాప్​ వెబ్​ల్లోనూ పనిచేస్తుంది. సెర్చ్ బై డేట్ (Search By Date) ఫీచర్‌లో ఒక పరిమితి ఉంది. అదేమిటంటే.. ప్రత్యేకంగా మీకు కావాల్సిన ఒక ఛాట్​ను​ మాత్రమే సెర్చ్​ చేద్దామంటే ఇందులో కుదరదు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఫీచర్​ను వాడటం ఇలా.. 

Also Read : Rinky Chakma : అందాల సుందరిని కబళించిన క్యాన్సర్.. 28 ఏళ్లకే తుదిశ్వాస

డీప్‌ఫేక్‌‌లపై  వాట్సాప్ పోరు 

డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోల బెడద ఇప్పుడు ఎంతగా ఉందో మనకు బాగా తెలుసు. ఇలాంటి తప్పుడు సమాచారానికి కళ్లెం వేసేందుకు వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ, డీప్​ఫేక్ టెక్నాలజీలతో రూపొందిస్తున్న వీడియోలు, ఫొటోలను అరికట్టేందుకు వాట్సప్‌లో ఒక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామని అనౌన్స్ చేసింది. దీని​ ద్వారా డీప్​ఫేక్​ చిత్రాలను, వీడియోలను సులభంగా గుర్తించవచ్చు. ఇందుకోసం ‘మిస్‌ఇన్ఫర్మేషన్‌ కంబాట్‌ అలయన్స్‌’ (MCA)తో టై అప్​ అయినట్లు వెల్లడించింది. 2024 మార్చిలోగా ఈ హెల్ప్​లైన్​ వాట్సాప్​ యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.

టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్

వాట్సాప్ ఇటీవలే టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనితో మనం టెక్ట్స్​ను అందంగా మార్చేయొచ్చు. ఒక వేళ టెక్ట్స్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని బుల్లెట్స్‌ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు ‘-‘ అని టైప్‌ చేయాలి. కంప్యూటర్​లో Shift + Enter ను టైప్‌ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్‌ పాయింట్ వచ్చేస్తుంది. ఒక వేళ మీకు నంబర్డ్‌ లిస్ట్‌ కావాలనుకుంటే టెక్ట్స్‌ ముందు ‘1, 2, 3’ ఇలా అంకెలను టైప్‌ చేయాలి. ఇది కూడా బుల్లెట్‌ పాయింట్స్​ మాదిరిగానే పని చేస్తుంది. సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్లను హైలైట్‌ చేసేందుకు ఆ వాక్యాల ముందు ‘>’ ని టైప్‌ చేయాలి. ఇదే బ్లాక్‌ కోట్‌. బ్యాక్‌గ్రౌండ్‌తో సహా వాక్యాన్ని హైలైట్‌ చేసేందుకు ఇన్‌లైన్‌ కోడ్‌ చిహ్నాల “మధ్యన పదాలు ఉంచాలి.

Also Read : Gruha Jyothi: రాష్ట్రంలో వ్యాప్తంగా గృహజ్యోతి పథకం అమలు.. జీరో బిల్లులు జారీ చేస్తున్న విద్యుత్ సిబ్బంది

Exit mobile version