Voice Chat : వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ‘వాయిస్ ఛాట్’ విశేషాలివీ..

Voice Chat : వాట్సాప్ గ్రూప్‌ కాల్స్  సెక్షన్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 03:47 PM IST

Voice Chat : వాట్సాప్ గ్రూప్‌ కాల్స్  సెక్షన్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. అదే.. ‘వాయిస్ ఛాట్’. వాట్సాప్‌ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌డేట్ చేసుకోగానే ఈ ఫీచర్ కనిపిస్తుంది. వాట్సాప్ గ్రూప్ కాల్ బటన్ వద్దే.. కొత్తగా ‘వాయిస్ ఛాట్’ ఆప్షన్ కూడా డిస్‌ప్లే అవుతుంది.  వాట్సాప్ గ్రూపులోని సభ్యులు ఛాటింగ్ చేసే క్రమంలో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. అయితే దీనికి ఒక లెక్క ఉంది. ప్రస్తుతానికి 32 కంటే ఎక్కువ మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూప్‌లకే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కనిష్టంగా 33 మంది, గరిష్టంగా 128 మంది సభ్యులున్న వాట్సాప్ గ్రూపులు వాయిస్ ఛాట్ ఫీచర్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే వాట్సాప్ ప్రైమరీ అకౌంట్ రిజస్టర్ అయిన డివైజ్ నుంచి మాత్రమే వాయిస్ ఛాట్ ఫీచర్‌ను వాడగలుగుతారు. వాట్సాప్‌ అకౌంటుతో లింక్ అయి ఉన్న ఇతర డివైజ్‌లలో ఈ ఫీచర్ పనిచేయదు. వాట్సాప్ గ్రూపులో వాయిస్ ఛాట్‌ను వాడాలంటే కనీసం ఒకరైనా తోటి సభ్యుడు లైవ్‌లో జాయిన్ కావాలి. ఒకరి కంటే ఎక్కువమంది సభ్యులు లైవ్‌లో జాయిన్ అయితే.. ఎంతసేపైనా వాయిస్ ఛాట్‌ను కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఒక్కరే ఉంటే.. ఒక గంట తర్వాత వాయిస్ ఛాట్ క్లోజ్ అయిపోతుంది. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో వాయిస్ ఛాట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని వాట్సాప్ సోమవారం ట్విట్టర్ వేదికగా(Voice Chat) వెల్లడించింది.

Also Read: Karachi: పాక్ లో వరుస ఉగ్రవాదుల హత్యలు