Messages Reminder : వాట్సాప్.. నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక నిత్యావసరంలా మారిపోయింది. ప్రజలు నిత్యం వాట్సాప్‌ను వాడుతున్నారు. కుటుంబీకులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు, తోటి వ్యాపారులతో టచ్‌లో ఉండేందుకు వాట్సాప్‌నే వినియోగిస్తున్నారు. అందుకే నంబర్ 1 మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ వెలుగొందుతోంది. మరో సూపర్ ఫీచర్ వాట్సాప్‌లో త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. అది అందుబాటులోకి వస్తే మనకు మరింత కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రత్యేకించి వాట్సాప్‌లో మనకు వచ్చే మెసేజ్‌ల విషయంలో నిత్యం అలర్ట్‌గా ఉండొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Bashar al Assad : సిరియా అధ్యక్షుడు అసద్ మృతి? విమానం కూలిందా.. కూల్చారా ?
రాబోయే కొత్త ఫీచర్(Messages Reminder) గురించి వాబీటా ఇన్ఫో ఒక బ్లాగ్ పోస్ట్‌ను తాజాగా ప్రచురించింది. దాని ప్రకారం.. మన ముందుకు రానున్న కొత్త ఫీచర్ పేరు ‘అన్ రీడ్ మెసేజెస్ రిమైండర్’. అంటే.. మనకు వచ్చిన మెసేజ్‌లలో చూడకుండా వదిలేసిన మెసేజ్‌ల గురించి మనకు రిమైండ్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. ముఖ్యమైన మెసేజ్‌లను మనం మిస్ కాకూడదు.. తప్పకుండా వాటిని చదవాలి అనుకుంటే ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక విడతల వారీగా వాట్సాప్ యూజర్ల కోసం అందుబాటులోకి తెస్తారు. ఇది అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్‌లో ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ‘నోటిఫికేషన్స్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ సెక్షన్‌లో ‘రిమైండర్స్’ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకుంటే ఇక మనకు ‘అన్ రీడ్ మెసేజెస్ రిమైండర్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేస్తుంది.
Also Read :Mysterious UFO : అమెరికాలో యూఎఫ్ఓల కలకలం.. ఏలియన్లు దిగి వచ్చాయా ?
ఛాట్ లాక్ ఫీచర్
వాట్సాప్ ఇప్పటికే ఛాట్ లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మనకు అవసరమైన ఛాట్స్‌ను లాక్ చేయొచ్చు. ఎలా అంటే.. మనం లాక్ చేయదల్చిన ఛాట్‌ను తొలుత ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు ఉన్న (:) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తదుపరిగా మనకు “ఛాట్ లాక్” ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి.. పాస్ వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. ఇక ఆ ఛాట్ లాక్ అయినట్టే. వాట్సాప్‌లో “హైడ్ లాక్ ఛాట్” అనే ఫీచర్ ఉంది. దాన్ని వాడుకొని లాక్ చేసిన ఛాట్‌ను సీక్రెట్‌గా దాచేయొచ్చు.