WhatsApp Without Number : ఫోన్ నంబరు లేకుండానే వాట్సాప్‌లోకి లాగిన్

WhatsApp Without Number : సాధారణంగా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలంటే ఫోన్‌ నంబర్ కచ్చితంగా ఉండాలి.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Multi Account

Whatsapp Multi Account

WhatsApp Without Number : సాధారణంగా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్‌ కావాలంటే ఫోన్‌ నంబర్ కచ్చితంగా ఉండాలి. ఫోన్‌ నంబరుకు వచ్చే 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేస్తేనే వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపై ఫోన్ నెంబర్ లేకున్నా యూజర్ తన అకౌంట్‌లోకి లాగిన్ అయ్యే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. దీని ద్వారా యూజర్‌కు ఫోన్ నెంబర్ అందుబాటులో లేని టైంలో ఈమెయిల్‌ వెరిఫికేషన్‌ ద్వారా వాట్సాప్ అకౌంట్‌లోకి లాగిన్ కావచ్చు. వాట్సాప్ యూజర్ దగ్గర ఒకవేళ అతడి ఫోన్‌ లేకపోయినా..  నెట్‌వర్క్‌ అందుబాటులో లేక ఓటీపీ రాకపోయినా.. ఇక ఎంచక్కా ఈమెయిల్ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎంతోమందికి ఉపయోగకరం కానుంది. ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ బీటా యూజర్ల కోసం రిలీజ్ కానున్న ఈ ఫీచర్‌కు  ‘‘వాట్సాప్ ఈ – మెయిల్‌ వెరిఫికేషన్‌’ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని క్లిక్ చేసి వాట్సాప్ యూజర్లు ఫోన్‌ నెంబర్‌కు బదులుగా ఈమెయిల్‌ ఐడీని టైప్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ మెయిల్‌ ఐడీకి వెరిఫికేషన్‌ లింక్ వస్తుంది. మీ మెయిల్‌ను ఓపెన్ చేసి.. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది జరిగిన వెంటనే మీరు వాట్సాప్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవుతారు. ఈ ఫీచర్‌తో పాటు ఆడియో కాల్స్, వీడియో కాల్స్‌ సమయంలో యూజర్ల లొకేషన్, ఐపీ అడ్రస్‌ వివరాలు అవతలి వాళ్లకు తెలియకుండా ఉండేందుకు ‘ప్రొటెక్షన్‌’ అనే మరో ఫీచర్‌ను ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చింది. ఒకసారి దాన్ని కూడా ట్రై చేసి(WhatsApp Without Number) చూడండి.

  Last Updated: 08 Nov 2023, 10:30 AM IST