OTT in Car: కారు స్క్రీన్‌పై ఓటీటీ యాప్స్ చూడాలనుకుంటున్నారా?

2023 ఆటో ఎక్స్‌పోలో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని (MG Hector SUV) లాంచ్ చేసినప్పుడు అందులో

Published By: HashtagU Telugu Desk
Want To See Ott Apps On Car Screen

Want To See Ott Apps On Car Screen

2023 ఆటో ఎక్స్‌పోలో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీని (MG Hector SUV) లాంచ్ చేసినప్పుడు అందులో అందించిన 14 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ విభాగంలో అందించిన అతి పెద్ద ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంల్లో ఇది కూడా ఒకటి. మీకు ఇష్టమైన సినిమాను దీనిపై చూడవచ్చా? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాదాపు ల్యాప్ ట్యాప్ స్క్రీన్ తరహాలో ఉండే దీనిపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం సాధ్యమేనా?

హెక్టర్ ఎస్‌యూవీలో వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే (Apple Car Play), ఆండ్రాయిడ్ ఆటో (Android Auto) అందుబాటులో ఉంది. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌ల ద్వారా మీ ఫోన్ డిస్‌ప్లేను కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫోన్ వైపు ఎక్కువ చూడకుండా డ్రైవర్ పరధ్యానాన్ని కూడా తగ్గిస్తుంది.

కాబట్టి మీరు జర్నీలో సరదాగా సినిమాలు చూస్తూ కూడా జర్నీ చేయవచ్చు. అయితే డ్రైవర్ మాత్రం రోడ్డు మీద దృష్టి పెట్టడం ముఖ్యం. దీని కారణంగా కారు ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంలో (Car infotainment system) కూడా ఎటువంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలను కూడా అందించలేదు. కానీ మీరు మీ వెనుక సీటులోని ప్రయాణీకులు విసుగు పుట్టకుండా ఉంచడానికి వారి కోసం ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టంలో ఏదైనా ప్లే చేయాల్సి ఉంటే రూటింగ్ ద్వారా చేయవచ్చు.

ఆండ్రాయిడ్ రూటింగ్

ఆండ్రాయిడ్ రూటింగ్ అనేది సిస్టమ్ ఫైల్స్‌కు యాక్సెస్ పొందడానికి వినియోగదారులను అనుమతించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని నిర్దిష్ట అంశాలు తొలగిపోతాయి. ఆండ్రాయిడ్ కార్ ప్లే వినియోగదారుల కోసం ఈ ప్రక్రియను జైల్ బ్రేకింగ్ అంటారు. రూటింగ్ ప్రక్రియలో సూపర్‌యూజర్ వంటి యాప్‌లు ఇన్‌స్టాల్ అవుతాయి. అది వినియోగదారులకు సూపర్‌యూజర్ అనుమతిని ఇస్తుంది.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సూపర్‌యూజర్‌ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి

రూటింగ్ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాల్ చేయడానికి కొన్ని అనధికారిక యాప్‌లు ఉంటాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు మరోసారి Android Autoని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్‌ను రీ లాంచ్ చేసి, అందులో అడిగిన ప్రతి పాపప్‌కు పర్మిషన్ ఇవ్వండి. ఆండ్రాయిడ్ ఆటో కాకుండా మీరు హెక్టర్ 14 అంగుళాల స్క్రీన్‌పై మీ ఫోన్ డిస్‌ప్లే స్క్రీన్‌ను ప్రతిబింబించే ఏఏ ఫెనో అనే యాప్‌ని కూడా డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండిటి ద్వారా మీరు చివరకు మీ హెక్టర్ లోపల నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోను చూడగలరు.

ఎంజీ హెక్టర్ లోపల నెట్‌ఫ్లిక్స్/అమెజాన్ ప్రైమ్ వీడియోను స్ట్రీమ్ చేయడానికి వీటిని ఫాలో అవ్వండి

1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో సూపర్‌యూజర్‌ని ఇన్‌స్టాల్ చేయండి
2. అనధికారిక యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి
3. ఆండ్రాయిడ్ ఆటోను రూటింగ్ తర్వాత ఇన్‌స్టాల్ చేయండి
4. (కెన్) ఫోన్ స్క్రీన్‌ను రిఫ్లెక్ట్ చేయడానికి ఏఏ ఫెనో డౌన్‌లోడ్ చేయండి

హెచ్చరిక: డ్రైవ్ చేస్తూ స్ట్రీమ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ అలా చేయకండి.

Also Read:  Heart Attack risk for Runners: రన్నర్లకు గుండెపోటు ముప్పు..

  Last Updated: 17 Feb 2023, 09:45 AM IST