Site icon HashtagU Telugu

Vivo V29e: ఈ రోజు లాంచ్ కానున్న వివో V29e

Vivo V29e

New Web Story Copy 2023 08 28t075151.980

Vivo V29e: ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరో కొత్త మోడల్​ను సిద్ధం చేసింది వివో సంస్థ. ఈ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో(Vivo) భారతదేశంలో Vivo V29e స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు భారత మార్కెట్లో ప్రదర్శించనుంది. ఈ రోజు ఆగస్టు 28న అందుబాటులోకి రానుంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది. వివో V29e పూర్తి HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ విక్రయం ఫ్లిప్ కార్ట్ (Flipkart), వివో డాట్ కామ్ (vivo.com) మరియు రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. వివో V29e రెడ్ మరియు బ్లూ రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో 8GB + 128GB మరియు 8GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. పరికరం ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 సపోర్ట్‌ను కలిగి ఉంటుంది, ఇది అదనంగా 8GB RAMని జోడిస్తుంది. 5G డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇందులో ప్రాథమిక 64MP సెన్సార్ 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో జత చేయబడుతుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఉంటుంది, ఇది అడ్రినో 619 GPUతో జత చేయబడుతుంది. 5,000mAh బ్యాటరీ సామర్ధ్యం.

Also Read: World Athletics Championship: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా