Auto Pay Scam : స్మార్ట్‌ఫోన్లకు ఇంటర్నెట్ విప్లవం తోడు కావడంతో మనదేశంలో యూపీఐ లావాదేవీలు రాకెట్ వేగంతో పెరిగాయి. అయితే ఈ పెనుమార్పులోనూ మోసాలకు తెగబడేందుకు ఉన్న మార్గాలను హ్యాకర్లు, సైబర్ కేటుగాళ్లు వెతుక్కుంటున్నారు. యూపీఐ పేమెంట్లను హ్యాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రత్యేకించి యూపీఐ ఆటోపే స్కాంలకు పాల్పడుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. తద్వారా ఆటోపే స్కాంల బారినపడకుండా మనల్ని మనం రక్షించుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
సైబర్ నేరగాళ్లు మన యూపీఐ నంబరుకు తొలుత ఆటోపే రిక్వెస్టును పంపుతారు. మనం దాన్ని పట్టించుకోకుండా తొందరలో ఓకే చేశామో మోసపోయినట్టే. అకౌంటు నుంచి ప్రతినెలా డబ్బులు కట్ అయిపోతాయి. హ్యాకర్ల అకౌంట్లలో అవి జమవుతాయి. సాధారణంగానైతే ఇలాంటి మోసపూరిత ఆటోపే రిక్వెస్టును చాలామంది ఈజీగానే గుర్తిస్తారు. అయితే ఓటీటీలు, డీటీహెచ్, ఇంటర్నెట్ ఫైబర్ నెట్ కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను ప్రతినెలా చెల్లించేందుకు చాలామంది ఆటోపే ఆప్షన్‌ను వాడుకుంటుంటారు. ఈవిషయం సైబర్ కేటుగాళ్లకు తెలుసు. అందుకే వాళ్లు అచ్చం అదేవిధంగా ఉండో లోగోతో మోసపూరిత ఆటోపే(Auto Pay Scam) రిక్వెస్టును పంపుతున్నారు. ఒకవేళ దాన్ని కచ్చితత్వంతో చెక్ చేయకుండానే రిక్వెస్టుకు ఓకే చేస్తే చిక్కుల్లో పడతాం. మనం కష్టపడి సంపాదించే డబ్బు హ్యాకర్ల పాలవుతుంది.
Also Read :Rahul Gandhi : సోనియాగాంధీకి ఫేవరేట్ ‘నూరీ’.. రాహుల్‌గాంధీ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
చాలామంది తమ ఫోన్ నంబర్లనే యూపీఐ ఐడీలుగా వాడుతుంటారు. ఇలాంటి వాళ్లనే సైబర్ కేటుగాళ్లు తొలి టార్గెట్‌గా ఎంచుకుంటున్నారని తాజా పోలీసు దర్యాప్తుల్లో తేలింది. అందుకే యూపీఐ ఐడీని ఫోన్ నంబరు కాకుండా పేరు, ఇతర యూనిక్ అక్షరాలతో తయారు చేసుకుంటే బెటర్. సీనియర్ సిటిజెన్లు, నిరక్షరాస్యులు ఇలాంటి మోసపూరిత ఆటోపే రిక్వెస్టులు నిజమైనవే అనుకొని మోసపోతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాంటి వారు ప్రైమరీ బ్యాంకు అకౌంటును యూపీఐకి లింకు చేసుకోకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అమౌంటు తక్కువగా ఉండే దాన్నే ప్రైమరీ బ్యాంకు అకౌంటుగా సెలెక్ట్ చేసుకుంటే హ్యాకర్ల చేతికి చిక్కే రిస్క్ తగ్గుతుందని అంటున్నారు.