UPI payments: ఫీచర్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారా.. తెలుగు వాయిస్ తో అటువంటి ఉపయోగాలు?

గతంలో యూపీఐ చెల్లింపు వ్యవస్థ కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 06:30 PM IST

గతంలో యూపీఐ చెల్లింపు వ్యవస్థ కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ యూపీఐ 123 పే సేవలను ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటినుంచి ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం కూడా ఆ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. కాగా ప్రస్తుతం వినియోగదారులు తమకు నచ్చిన భాషలో ఫోన్ మాట్లాడి యూపీఐ చెల్లింపులు చేయవచ్చట. ఈ సదుపాయాన్ని టోన్ ట్యాగ్ సంస్థ సరికొత్తగా తీసుకొచ్చింది.

ఈ టోన్ ట్యాగ్ సంస్థ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల భాగస్వామ్యంతో ఈ యూపీఐ 123 పే సేవలను ఈ ఏడాదిలో మొదలుపెట్టింది. కాగా ప్ర‌స్తుతం టోన్ ట్యాగ్‌ ఫ‌స్ట్ వాయిస్‌ సొల్యూష‌న్‌తో ఈ సేవ‌ల‌ను మ‌రింత‌ విస్త‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఆ సంస్థ పట్టణ,గ్రామీణ భారతదేశము మధ్య ఉన్న అలాగే డిజిటల్ చెల్లింపుల అంతరాయాన్ని తగ్గిస్తుంది అని తెలిపింది. హిందీ , తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో యూపీఐ 123 పే చెల్లింపులు చేసేందుకు అనుమ‌తిస్తుందని వెల్లడించింది.

కాగా ప్ర‌స్తుతం ఈ సేవ‌లు కొన్ని ప్రాంతీయ భాష‌ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని త్వ‌ర‌లోనే గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి మ‌రికొన్ని భాష‌ల‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామ‌ని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. చెల్లింపుల కోసం వినియోగదారులు 6366 200 200 ఐవీఆర్ నంబ‌ర్‌కు కాల్ చేసి వారి ప్రాంతీయ భాష‌ను ఎంపిక చేసుకుని ఆర్థిక లావాదేవీలు కొన‌సాగించ‌వ‌చ్చు. ఈ సేవ‌తో వినియోగ‌దారులు నిధుల‌ను బ‌దిలీ చేయ‌లేరు. యుటిలిటీ బిల్లు చెల్లింపులు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటివి వాయిస్ ఉప‌యోగించి చేయ‌వ‌చ్చు.