United Nations-AI Risks : ఏఐ టెక్నాలజీపై 5 పవర్ ఫుల్ దేశాల మీటింగ్.. ఎందుకు ?

United Nations-AI Risks : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై  ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్)కి ఆయువు పట్టుగా ఉండే భద్రతా మండలి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కస్ చేయబోతోంది. 

Published By: HashtagU Telugu Desk
United Nations Ai Risks

United Nations Ai Risks

United Nations-AI Risks : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై  ఇప్పటిదాకా అంతటా చర్చ జరిగింది.. 

అన్ని రంగాల ప్రముఖులూ దానిపై తమ ఒపీనియన్ చెప్పేశారు.. 

ఇప్పుడు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్)కి ఆయువు పట్టుగా ఉండే భద్రతా మండలి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై డిస్కస్ చేయబోతోంది. 

న్యూయార్క్‌లో జులై 18న (మంగళవారం)  భేటీ కానున్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై తొలిసారిగా అధికారిక చర్చను నిర్వహించనుంది. ఈనెలలో UN భద్రతా మండలి అధ్యక్ష పదవి బ్రిటన్ కు వచ్చింది. దీంతో AI నియంత్రణలో ప్రపంచ నాయకత్వ పాత్రపై చర్చను జరపాలని బ్రిటన్ డిసైడ్ చేసింది. ప్రపంచ శాంతి, భద్రతపై  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై ఈనెల 18న జరిగే మీటింగ్ లో చర్చ జరుగుతుందని(United Nations-AI Risks) తెలిపింది. ఈ మీటింగ్ కు  బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ అధ్యక్షత వహించనున్నారు.

Also read : Vande Bharat Fire: భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ రైలులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

అయితే అంతర్జాతీయ AI పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయడానికి గత నెలలోనే (జూన్‌) యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అంగీకారం తెలిపారు. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) తరహాలో ఈ సంస్థ పనిచేస్తుందని వెల్లడించారు.  AI గవర్నెన్స్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి , వాటితో ముడిపడిన మానవ హక్కుల వ్యవహారాలపై స్టడీ చేసి సిఫార్సులను చేయడానికి ఒక ఉన్నత స్థాయి AI సలహా సంఘం ఏర్పాటు చేస్తామని గుటెర్రెస్ అప్పట్లో చెప్పారు. ఐక్యరాజ్య సమితి  భద్రతా మండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. భద్రతా మండలి సభ్యత్వం కోసం మరో 10 దేశాలను రెండు సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు.

Also read : Delhi : ఢిల్లీలో భారీ వ‌ర్షాలు.. రేప‌టి వ‌ర‌కు స్కూల్స్ బంద్‌

  Last Updated: 17 Jul 2023, 10:02 AM IST