Data Leak : చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. యూజర్ల 2600 కోట్ల రికార్డులు చోరీ

Data Leak : ఎక్స్‌ (ట్విటర్‌), లింక్డ్‌ఇన్‌, డ్రాప్‌బాక్స్‌ , అడోబ్‌, కాన్వా, టెలిగ్రామ్‌ వంటి వందలాది ప్రముఖ వెబ్‌సైట్ల యూజర్ల వివరాలు చోరీకి గురయ్యాయి.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 08:31 AM IST

Data Leak : ఎక్స్‌ (ట్విటర్‌), లింక్డ్‌ఇన్‌, డ్రాప్‌బాక్స్‌ , అడోబ్‌, కాన్వా, టెలిగ్రామ్‌ వంటి వందలాది ప్రముఖ వెబ్‌సైట్ల యూజర్ల వివరాలు చోరీకి గురయ్యాయి.  యూజర్లకు సంబంధించిన దాదాపు 2,600 కోట్ల రికార్డులు లీక్(Data Leak) అయ్యాయి. ఇది చరిత్రలోనే అతి పెద్ద డేటా లీక్‌ అని పరిశీలకులు చెబుతున్నారు. సురక్షితం కాని ఓ వెబ్‌సైట్లో ఈ లీకేజీకి సంబంధించిన అతిపెద్ద డేటాబేస్‌ను సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారంటూ ఫోర్బ్స్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. దాదాపు 12 టెరాబైట్ల డేటా లీక్‌ అయిందని  పేర్కొంది. ఇందులో అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫిలిప్పీన్స్, టర్కీ సహా పలు దేశాల ప్రభుత్వ సంస్థల రికార్డులను కూడా ఉన్నాయట. టెన్సెంట్ కంపెనీకి చెందిన 1.5 బిలియన్ల యూజర్ల రికార్డులు, వీబోకి చెందిన 504 మిలియన్లు, మైస్పేస్‌కు చెందిన 360 మిలియన్లు, ట్విట్టర్‌కు చెందిన 281 మిలియన్లు, లింక్డ్ఇన్‌కు చెందిన 251 మిలియన్లు, అడల్ట్‌ఫ్రెండ్‌ఫైండర్‌కు చెందిన 220 మిలియన్ల యూజర్ల రికార్డులు లీకయ్యాయి. లీకైన డేటాలో యూజర్ల ఖాతాల పేర్లు, పాస్‌వర్డ్‌లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వివరాలను ఉపయోగించి యూజర్ల వ్యక్తిగత ఖాతాలను సైబర్ నేరగాళ్లు యాక్సెస్‌ చేసే రిస్క్, సైబర్‌ దాడులు చేసే ముప్పు ఉందని సెక్యూరిటీ డిస్కవరీ అండ్‌ సైబర్‌ న్యూస్‌ పరిశోధకులు వార్నింగ్ ఇచ్చారు. అందుకే నెటిజన్స్ ఎప్పటికప్పుడు అవసరమైన సెక్యూరిటీ అప్‌డేట్స్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. గతంలోనూ ఈవిధమైన భారీ డేటా లీక్‌‌లు జరిగాయి. 2019 సంవత్సరంలో ఒక అన్‌సెక్యూర్డ్‌ వెబ్‌సైట్‌లో 100 కోట్ల రికార్డులు లీకయ్యాయి. 2013లో యాహూ యూజర్లకు సంబంధించిన 300 కోట్ల వివరాలు లీకయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

అతడు కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌‌ను ప్రారంభించాడు.  దాని ద్వారా విరాళాలను సేకరించాడు. ఈ వ్యవహారం నడిపిన నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది విరాళాల సేకరణ కోసం కాంగ్రెస్‌ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు అదే పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించారు. కొందరు దీని ద్వారా చెల్లింపులు కూడా చేసినట్టు పార్టీ నేతలు గుర్తించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కి చెందిన సురేంద్ర చౌదరిని నిందితుడిగా గుర్తించారు. జైపుర్‌ వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు.

Also Read :Trump Vs Biden : ‘బైడెన్‌ 81’ వర్సెస్ ‘ట్రంప్‌  77’.. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజ