Site icon HashtagU Telugu

Twitter New Logo Live : “ట్విట్టర్”లో పిట్ట ఎగిరిపోయింది.. “X” వచ్చేసింది

Twitter New Logo Live

Twitter New Logo Live

Twitter New Logo Live :  ట్విట్టర్  లోగో  మారిపోయింది.. కొత్త లోగో “X” లైవ్ లోకి వచ్చింది.  

డెస్క్ టాప్ వర్షన్ లో..  ట్విట్టర్ లోగోలోని బ్లూ కలర్ పిట్ట బుర్రుమని ఎగిరిపోయింది. 

ఇప్పుడు ట్విట్టర్ కొత్త లోగోలో “X” అనే అక్షరం సింపుల్ లుక్ లో ఉంటుంది.      

త్వరలోనే ట్విట్టర్ మొబైల్ యాప్ వర్షన్ లో కూడా ఈ మార్పు లైవ్ లోకి వస్తుంది.     

ఈ మార్పు వివరాలను తెలుపుతూ  ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్  ఆదివారం రోజే  ట్వీట్ చేశారు. 

ఆయన ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ట్విట్టర్  డెస్క్ టాప్ వర్షన్ లో కొత్త లోగో లైవ్ అయింది.

Also read : Allu Arjun-Threads Record : ఒక్క పోస్టుతో 1 మిలియన్ ఫాలోయర్స్.. థ్రెడ్స్ లో బన్నీ హవా   

ఎలాన్ మస్క్ గత సంవత్సరం రూ.3.50 లక్షల కోట్లకు ట్విట్టర్ ను కొన్నారు. అప్పటి నుంచే ఈ సోషల్ మీడియా యాప్ లో ఎన్నో మార్పులు చేశారు. ఈక్రమంలోనే  ట్విట్టర్ యొక్క ప్రసిద్ధ బ్లూ బర్డ్ స్థానంలో కొత్త “X” లోగోను ఆయన ఆవిష్కరించారు. ట్విట్టర్ డెస్క్‌టాప్ వెర్షన్‌లో X కనిపించడం(Twitter New Logo Live)  ప్రారంభమైంది.  ఈనేపథ్యంలో  శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ఐకానిక్ ట్విట్టర్  పక్షి లోగోను కూడా తీసేశారు.

Also read : 700 Myanmar Nationals Entry : మయన్మార్ నుంచి మణిపూర్ కు వందలాది మంది వలస.. ఎందుకు ?