TVS Apache: న్యూ లుక్ లో టీవీఎస్‌ అపాచీ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్ లు ఇవే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల టీవీఎస్ ద్విచక్ర వాహనాలను

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 05:55 PM IST

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల టీవీఎస్ ద్విచక్ర వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసింది తెలిసిందే. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త మోడల్స్ ని తీసుకువస్తోంది. ఇలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి సరికొత్త లుక్ లో రెండు అపాచీ బైకులను తీసుకువచ్చింది. టీవీఎస్‌ మోటార్‌ 2023 స్పెషల్‌ ఎడిషన్‌ టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ తాజాగా ప్రవేశపెట్టింది. కొత్త కలర్‌, కొత్త అప్‌డేట్స్‌తో స్పెషల్‌గా ఆవిష్కరించింది.

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ బైక్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే.. 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్‌ కూల్డ్, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజన్‌ తో లభించనుంది. అలాగే ఇది 250 ఆర్‌పీఎం వద్ద 17.39 బీహెచ్‌పీ పవర్, 7250 ఆర్‌పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్‌ లో బ్లాక్ రెడ్ కలర్ అలాగే కొత్త పెర్ల్ వైట్ కలర్ లలో ఈ బైక్ లభించింది. కొత్త సీటు నమూనాతో డ్యూయల్ టోన్ సీటు, ఎడ్జస్టబుల్‌ క్లచ్ అండ్‌, బ్రేక్ లివర్లు,  అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్‌మోడ్స్‌ లో లభించనున్నాయి.

ఇకపోతే తాతగా మార్కెట్లోకి విడుదల చేసిన ఈ బైక్ యొక్క ధర విషయానికి వస్తే..ఈ స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కాగా తాజాగా మార్కెట్లోకి విడుదలైన ఈ బైక్ సరికొత్త లుక్ లో అద్భుతమైన కలర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కాగా బైక్స్ అత్యాధునిక సాంకేతికతతో కస్టమర్ సెంట్రిసిటీలో ఎప్పుడు ముందంజలో ఉన్నాయనీ, అలాగే కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్‌ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ తెలిపారు.