Top Phones Under 10k: రూ.10 వేల కంటే తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

మార్కెట్లో వందల రకాల స్మార్ట్ ఫోన్ లు నా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ అబ్బురపరిచే ఫీచర్స్ తో బడ్జెట్

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 05:04 PM IST

మార్కెట్లో వందల రకాల స్మార్ట్ ఫోన్ లు నా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ అబ్బురపరిచే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లను ఆయా కంపెనీలు విడుదల చేస్తూ ఉంటాయి. ఏ బడ్జెట్ ధరలో కావాలంటే ఆ బడ్జెట్ ధరలో ప్రస్తుతం మనకు మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే పదివేల లోపు స్మార్ట్ ఫోన్ లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికీ చక్కని శుభవార్త. అదేమిటంటే మార్కెట్ లోపు 10,000 లోపు అబ్బురపరిచే ఫీచర్లతో ఒక ఏడు స్మార్ట్ ఫోన్ లు సందడి చేస్తున్నాయి. మరి ఆ స్మార్ట్ ఫోన్ల వివరాల విషయానికొస్తే…సాంసంగ్ గేలాక్సీ ఎఫ్04 ఫోన్ ధర రూ. 9,249. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే రానుంది.

వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే మరో స్మార్ట్ ఫోన్ ఒప్పో ఏ17కే పదివేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 9,499 గా ఉంది. ఇది 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తోంది. వెనుక వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. అలాగే మరో స్మార్ట్ ఫోన్.. మోటోరోలా జీ31 ధర రూ. 9,499 గా ఉంది. దీనిలో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. కాగా ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. అలాగే ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది.

10 వేల లోపు లభించే స్మార్ట్ ఫోన్స్ లో స్మార్ట్ ఫోన్స్ లో రెడ్ మీ 10 కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,999 గా ఉంది. దీనిలో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే మరో స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ33 ఈ స్మార్ట్ ఫోన్ ధర కూడా రూ. 9,999 గా ఉంది. దీనిలో 6.5 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. వెనుకవైపు ఏకంగా 50ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. మరో స్మార్ట్ ఫోన్ వివో వై 15ఎస్ ఫోన్ ధర రూ. 9,499 గా ఉంది. దీనిలో 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 10 లోపు లభించే స్మార్ట్ ఫోన్ లలో ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,499 గా ఉంది. దీని డిస్ ప్లే 6.6 అంగుళాలు ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్ ఉంటుంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్ ఉంటుంది.