Drone Satellite : అది అలాంటి ఇలాంటి డ్రోన్ కాదు.
సాధారణ డ్రోన్స్.. ఫోటోలు, వీడియోలను తీసేందుకు పనికొస్తాయి.
ఇంకొన్ని డ్రోన్స్ సామాన్లను మోసుకెళ్లేందుకు పనికొస్తాయి.
కానీ మనం పరిచయం చేసుకోబోయే డ్రోన్ 5జీ ఇంటర్నెట్ ను భూమికి ఇవ్వగలదు.
ఏకంగా 20 నెలల పాటు 70వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ మనకు 5జీ ఇంటర్నెట్ సిగ్నల్స్(Drone Satellite) పంపగలదు..
మనం తెలుసుకోబోతున్నది PHASA-35 డ్రోన్ గురించి.. ఈ అత్యాధునిక డ్రోన్ ను బ్రిటన్ దేశానికి చెందిన బీఏఈ కంపెనీ 2020లో డెవలప్ చేసింది. ఈ డ్రోన్ కు 115 అడుగుల పొడవైన రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల్లో సోలార్ ప్యానెల్స్ అమర్చి ఉంటాయి. ఈ డ్రోన్ లోపల ఉండే గదిలో సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. 15 కిలోల బరువైన వస్తువులను మోసుకెళ్లే సామర్ధ్యం దీని సొంతం. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో 4G, 5G కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ డ్రోన్ ను రెడీ చేశారు. కొత్త విషయం ఏమిటంటే.. PHASA-35 డ్రోన్ ను ఇటీవల అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ప్రయోగించగా 24 గంటల వ్యవధిలో 66,000 అడుగుల ఎత్తుకు ఎగబాకి స్ట్రాటో ఆవరణకు చేరుకొని విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇది ఇప్పటివరకు రెండుసార్లు స్ట్రాటో ఆవరణకు జర్నీ చేసి ,సేఫ్ గా భూమికి తిరిగి వచ్చింది.
Also read : Onions: టమాటా తర్వాత ఉల్లి.. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు..!
ఈ డ్రోన్ కు, శాటిలైట్ కు తేడా ఏమిటి ?
PHASA-35 డ్రోన్ బరువు 150 కేజీలు మాత్రమే. దీని తయారీకి అయ్యే ఖర్చు శాటిలైట్ల తయారీ ఖర్చు కంటే చాలా తక్కువ. అందువల్ల భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్స్ ను శాటిలైట్ల ప్లేస్ లో వాడే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సోలార్-ఎలక్ట్రిక్ పవర్ తో ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్ భూమి వాతావరణంలోని స్ట్రాటో పొరకు వెళ్లి అక్కడే పర్మినెంట్ గా ఉంటుంది. అక్కడ గురుత్వాకర్షణ శక్తి లేదు. కాబట్టి ఇది భూమి కక్ష్యలో తిరుగుతుంది. స్ట్రాటో ఆవరణలో వాతావరణం లేదా గాలుల ప్రభావం ఉండదు. అందుకే ఈ డ్రోన్ చాలా కాలం పాటు అక్కడే ఉండి ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలదు. దీని రెక్కలలో ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఛార్జ్ చేయబడిన బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీ జీవితకాలం ముగిసినప్పుడు, ఉపగ్రహం నిరుపయోగంగా మారుతుంది. చివరకు ఇది అంతరిక్షంలో వ్యర్థాల రూపంలో మిగిలిపోతుంది.
Also read : Commonwealth Games: 2026 కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణపై సందిగ్ధత.. బడ్జెట్ పెరుగుదలే కారణమా..?
పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు భద్రత
PHASA-35 డ్రోన్ స్ట్రాటోస్పియర్‌లో ఉండటం వల్ల పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు ఉపశమనం, సరిహద్దు భద్రత, సముద్ర , సైనిక నిఘాలో సహాయపడుతుంది. ఇది అంతరిక్షం నుంచి భూమి యొక్క సమాచారాన్ని సేకరించి ఇవ్వగలదు. ఇందులోని సెన్సార్లు అడవులను పర్యవేక్షిస్తాయి. చెట్ల తేమ స్థాయిపై వివరాలను సేకరించి అందిస్తాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటే దానిపై హెచ్చరికలు జారీ చేస్తాయి.