Trifoldable Phone: ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. దీన్ని చైనాకు చెందిన హువావే కంపెనీ తయారు చేసింది. ‘హువావే మేట్ ఎక్స్‌టీ’ పేరుతో దీన్ని తొలుత సెప్టెంబర్ 10న చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈవిషయాన్ని హువావే కంపెనీ వెల్లడించింది. దీని ధర దాదాపు రూ.3.35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసిన కంపెనీగా హువావే అవతరించనుంది. హువావే కంపెనీకి చెందిన ట్రై ఫోల్డబుల్ ఫోన్‌లో రెండు ఇన్‌వర్డ్ స్క్రీన్లు(Trifoldable Phone) ఉంటాయి. ఒక అవుట్‌వర్డ్ స్క్రీన్ డ్యూయల్ హింజ్ మెకానిజమ్ ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి హువావే కంపెనీ కంటే ముందే టెక్నో కంపెనీ ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసింది. ఇటీవలే IFA బెర్లిన్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్లో కూడా దీని ఫస్ట్ లుక్‌ను అందరి ఎదుట ప్రదర్శించింది. అయితే మార్కెట్లో దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయాన్ని తెలపలేదు. వచ్చే ఏడాది చివరికల్లా టెక్నో కంపెనీ నుంచి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో చైనా కంపెనీ హువావే టెక్నో కంటే ముందే మార్కెట్‌లోకి ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్‌తో ఫోన్‌ను విడుదల చేస్తుండటం గమనార్హం.
Also Read :Telangana Doctors : ఆ డాక్టర్లకు డబుల్ శాలరీలు.. త్వరలోనే కీలక ప్రకటన !
టెక్ మార్కెట్‌పై చైనా కంపెనీలు ఎంత ఫోకస్ చేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ పరిణామం నిలువెత్తు నిదర్శనం. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ చాలా పెద్దది. దీన్ని అందిపుచ్చుకొని తమ దేశానికి ఇతర దేశాల నుంచి సాధ్యమైనంత ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టడంపై చైనా కంపెనీలు సీరియస్‌గా పనిచేస్తున్నాయి. ఈక్రమంలో వాటికి చైనా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. అందుకే అవి అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు చెందిన కంపెనీల కంటే ముందే అత్యద్భుత టెక్ ఉత్పత్తులను మార్కెట్‌కు అందించగలుగుతున్నాయి.