Site icon HashtagU Telugu

X Outage : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన ట్విట్టర్ సేవలు

Social Media X Outage

X Outage : సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) సేవలకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఆ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అయితే ‘డౌన్‌ డిటెక్టర్’ అనే వెబ్‌సైట్ ఈవిషయాన్ని వెల్లడించింది. వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ‘డౌన్‌ డిటెక్టర్’ దీనిపై ప్రకటన చేసింది.  భారత్‌లోనూ ఇవాళ ఉదయం 9 గంటలకు 700 మందికిపైగా వినియోగదారులు ఎక్స్ పనిచేయడం లేదని తమకు రిపోర్ట్ చేశారని తెలిపింది. అంతకుముందు మంగళవారం రోజు కూడా అమెరికాలోని దాదాపు 36,500 మంది ఎక్స్ వినియోగదారులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

కెనడాకు చెందిన 3,300 మంది, బ్రిటన్‌‌కు చెందిన 1,600 మంది ఎక్స్ పనిచేయడం లేదని తమకు రిపోర్ట్ చేశారని డౌన్ డిటెక్టర్(X Outage) వెల్లడించింది.ఎక్స్(ట్విట్టర్) సేవలకు అంతరాయం కలగడం ఇదే తొలిసారేం కాదు. ఇదే నెల ప్రారంభంలోనూ ఒకసారి ఇలాగే జరిగింది. చాలామంది యూజర్లు ఎక్స్‌లోని పోస్ట్‌లను చూడలేక గందరగోళానికి గురయ్యారు. అప్పట్లో ఎక్స్ పనిచేయకపోవడంపై విమర్శలు గుప్పిస్తూ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీమ్స్ వెల్లువెత్తాయి. అయితే ఆ వెంటనే ఎక్స్ సేవలను పునరుద్ధరించారు. దీంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Trump – Kamala : కమలతో డిబేట్‌కు నేను రెడీ.. ట్రంప్ కీలక ప్రకటన

‘ఎక్స్’ సోషల్ మీడియా యాప్‌ను మరింతగా మెరుగుపర్చడంపై దాని యజమాని ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు. త్వరలోనే దానిలో ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే ఈ పేమెంట్ సేవలు వాలెట్‌తో నడుస్తాయా ? బ్యాంక్ అకౌంటుతో నడుస్తాయా ? అనేది తెలియాల్సి ఉంది.ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు అమెరికాలోని 33 రాష్ట్రాల నుంచి ఎలాన్ మస్క్ ఇప్పటికే లైసెన్స్‌లను పొందినట్లు సమాచారం. దేశవ్యాప్త ఆర్థిక సేవలను అందించడానికి ఫిన్‌టెక్ పరిశ్రమలో బలమైన ఉనికిని నెలకొల్పాలని మస్క్ యోచిస్తున్నారు. క్రమంగా ఈ ఫీచర్‌ను ఇతర ప్రపంచ దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read :MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ