Site icon HashtagU Telugu

Diamond Making : 15 నిమిషాల్లో డైమండ్ మేకింగ్.. సరికొత్త టెక్నాలజీతో మ్యాజిక్

Diamond Making

Diamond Making

Diamond Making :  వజ్రం.. దీని తయారీ అంత ఈజీ ముచ్చట కాదు. దీన్ని ఈజీగా మార్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేవలం 15 నిమిషాల్లోనే భారీ ఉష్ణోగ్రత కానీ.. భారీ ఒత్తిడి కానీ లేకుండానే వజ్రాన్ని తయారు చేసే టెక్నాలజీని తయారు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ప్రయత్నాలు సఫలమైతే సింథటిక్ డైమండ్ ఇండస్ట్రీలో పెద్ద విప్లవాన్ని మనం చూస్తాం.

We’re now on WhatsApp. Click to Join

సాధారణంగానైతే 1500 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ వద్ద అత్యంత ఒత్తిడిలో వేల సంవత్సరాల పాటు మండిపోయిన కార్బన్ అణువులు వజ్రాలుగా మారుతాయి. అందుకే వజ్రాలు భూమికి చాలా లోతు ప్రాంతాల్లో దొరుకుతాయి. వందల మైళ్లు తవ్వితే తప్ప అవి బయటపడవు. అందుకే వజ్రాన్ని మనం క్రియేట్ చేయలేం. వజ్రం తయారీకి అవసరమైన వాతావరణాన్ని మనం కృత్రిమంగా కల్పించలేం. ఇది అసాధ్యం అని తెలిసి కూడా.. సుసాధ్యం చేసే దిశగా సౌత్ కొరియాలోని  ఇన్‌స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్‌కు చెందిన ఓ శాస్త్రవేత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన రీసెర్చ్‌పై  ఏప్రిల్ 24న  పబ్లిష్ అయిన అధ్యయన నివేదికపై అంతటా చర్చ జరుగుతోంది.

Also Read : Stage Collapse : కుప్పకూలిన స్టేజీ.. 9 మంది మృతి.. 54 మందికి గాయాలు

సౌత్‌ కొరియాకు చెందిన ఆ శాస్త్రవేత్త కథనం ప్రకారం.. ఓ గ్రాఫైట్‌ పాత్రలో గాలియంని, సిలికాన్‌ని కలిపి విపరీతంగా వేడి చేశారు. సముద్రాల వద్ద ఉండే వాతావరణ పీడన స్థాయి వద్ద ఆ పాత్రను ఉంచారు. ఇదే విధంగా రకరకాల ప్రయోగాలు చేశారు. గాలియం, నికెల్, ఐరన్‌ని సిలికాన్‌తో కలిపి ఇలా వేడి చేసినప్పుడు వజ్రాలు తయారయ్యేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోందని వెల్లడైంది. అది కూడా కేవలం 15 నిముషాల్లోనే వజ్రాలు తయారు చేసుకోవచ్చనీ ఈ ప్రయోగం ద్వారా గుర్తించారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఎన్నో సవాళ్లు ఉంటాయని సదరు శాస్త్రవేత్త చెప్పారు. ఈ ప్రాసెస్‌లో చిన్న చిన్న వజ్రాలనే తయారు చేసుకోడానికి వీలు కలుగుతుందన్నారు. సహజంగా ఏర్పడే వజ్రాల కన్నా ఇలా తయారయ్యే వజ్రాలు చిన్న సైజులో ఉంటాయని చెప్పారు. మరో రెండేళ్లలో ఈ ప్రక్రియను(Diamond Making) మరింత డెవలప్ చేస్తానని ఆ శాస్త్రవేత్త వెల్లడించారు.

Also Read : TGS RTC LOGO : టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేకా ? నిజమైందేనా ? సజ్జనార్ క్లారిటీ