Samsung Galaxy S24 : వచ్చే ఏడాది జనవరి 18న శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) ఫోన్ రిలీజయ్యే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్24 సిరీస్ లో భాగంగా ఎస్24, ఎస్24 ప్లస్, ఎస్24 అల్ట్రాలను శాంసంగ్ లాంఛ్ చేయనుంది. ఈసారి ఎస్24 అల్ట్రా ఫోన్‌లో ‘ఐఫోన్ 15ప్రో’ ఫోన్ తరహా టైటానియం ఫ్రేమ్ ఉంటుందని భావిస్తున్నారు. ప్రారంభ ధరల విషయానికి వస్తే.. శాంసంగ్ ఎస్24 ఫోన్ రూ. 72,990, ఎస్24 ప్లస్ ధర రూ.85,990, ఎస్24 అల్ట్రా ధర రూ. 1,19,990 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎస్24 ఫోన్‌లో 4000 mAh బ్యాటరీ, ఎస్24 ప్లస్‌లో 4900 mAh బ్యాటరీ, S24 అల్ట్రాలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం 200 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగా పిక్సెల్స్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. వీటికితోడు 10 మెగా పిక్సెల్స్ టెలిఫోటో కెమెరా కూడా దీనిలో ఉండనుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ ఫోన్లలో 50 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగా పిక్సెల్స్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 10 మెగా పిక్సెల్స్ టెలిఫోటో కెమెరా కూడా వీటిలో ఉంటుంది. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ వేరియంట్లలో శాంసంగ్ కంపెనీ 12 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించనుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో 6.2 అంగుళాల ఏఎంవో ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్‌లో 6.7 అంగుళాల ఏఎంవో ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 6.8 అంగుళాల ఏఎంవో ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి అదనంగా ఇది WQHD+ రిజల్యూషన్ డిస్‌ప్లేను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మోడల్ కుడి అంచున అల్ట్రా వైడ్‌బ్యాండ్ యాంటెన్నా సైతం ఉంటుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24 ప్లస్ ఫోన్ల మోడల్స్‌ను Exynos 2400 ప్రాసెసర్‌తో తీసుకొస్తారని తెలుస్తోంది. కొన్ని దేశాలలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో అందిస్తారని సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్‌లో అన్ని దేశాలలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుందని అంటున్నారు.
Also Read: Whats Today : నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. మేడిగడ్డకు కేంద్రం నిపుణులు